- చిలకలగూడ పోలీస్ కానిస్టేబుళ్ల దాష్టీకం
జిమ్ ట్రైనర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కాలు విరిగిన సంఘటన సికిందరాబాద్‌లోని మెట్టుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళితే … మెట్టగూడకు చెందిన జిమ్ ట్రైనర్ ఆరోఖ్యరాజ్ బైక్ విషయంలో మరో వ్యక్తితో గొడవ జరిగింది. దీని గురించి సదరు వ్యక్తి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు కానిస్టేబుళ్లు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆరోఖ్యరాజ్‌కు ఇంటికి వెళ్లి పోలీస్‌స్టేషన్‌కు రావాలని చెప్పారు. కానీ ఆరోఖ్యరాజ్ ఇప్పడు రాత్రి అయిందని, రేపు వస్తానని చెప్పడంతో ఆ నలుగరు కానిస్టేబుళ్లు కోపోద్రిక్తులై పెద్ద కర్రలతో ఇష్టానుసారంగా ఆరోఖ్యరాజ్‌ను కొట్టారు. విచక్షణారహితంగా దాడి చేసి అతని కాలు విరిగిపోయేలా తన్నారు.
తన కొడుకును కొట్టొద్దని తల్లి వేడుకున్నా పోలీసులు కనికరం చూపించలేదు. ఆరోఖ్యరాజ్ శరీరమంతా తీవ్ర గాయాలై పడిఉన్న అతన్ని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించారు. బస్తీవాసులు పెద్ద ఎత్తున ఆరోఖ్యరాజ్ ఇంటికి చేరడంతో కానిస్టేబుళ్లు అక్కడి నుండి మెళ్లగా జారుకున్నారు. ఆ తర్వాత విషయం ఏంటంటే పోలీసులే మళ్లీ జరిగిన సంఘటన గురించి బేరసారాలు ఆడారు. ఈ విషయాన్ని ఎక్కువ చేయవద్దని తెలిపారు. కానిస్టేబుళ్లు మాత్రం ఆరోఖ్యరాజ్‌యే ముందు తమై దాడికి యత్నించినట్లు చెప్పడం నమ్మశక్యం కాని విషయం.