భారత మాజీ రాష్ర్టపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ తీవ్ర అనారోగ్యంతో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే మంగళవారంనాడు ఆయన అంత్యక్రియలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో జరగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడి ప్రణమ్ ముఖర్జీ చిత్రపటానికి పులమాల వేసి నివాళ్లర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవల గురించి స్మరించుకున్నారు.
