end

జిల్లాలో పోలీసు యాక్ట్ 30, 30(ఎ) అమలు

  • జిల్లా ఇంచార్జ్ ఎస్పీ జోయల్ డేవిస్

జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల (అక్టోబర్ 1వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఇంచార్జ్ ఎస్.పి జోయల్ డేవిస్ తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. అలాగే ప్రభుత్వ, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్.పి హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు తమకు ఈ విషయంలో సహకరించాలని కోరారు.

హైకోర్టును ఆశ్రయిస్తాంః ముస్లిం లా బోర్డు

ఏపీలో ప్రత్యేక రైల్వే సర్వీసులు

Exit mobile version