end
=
Sunday, November 10, 2024
సినీమారణ్‌వీర్ సింగ్‌పై పోలీస్ కంప్లైంట్
- Advertisment -

రణ్‌వీర్ సింగ్‌పై పోలీస్ కంప్లైంట్

- Advertisment -
- Advertisment -

న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ రీసెంట్ గా ఓ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ఈ హీరో న్యూడ్ అండ్ బోల్డ్ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. 1972లో కాస్మొపాలిటన్‌ మ్యాగజైన్ కోసం పాప్‌ ఐకాన్‌ బర్ట్‌ రెనాల్డ్స్‌కు నివాళిగా నటుడు ఈ ఫొటోషూట్‌ చేశారు. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా పేపర్‌ మ్యగజైన్‌ కోసం ఫోజులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘సూపర్‌ హాట్‌’ అంటూ రణ్‌వీర్‌ కోస్టార్స్‌, అభిమానులు అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. రణ్‌వీర్‌ కంటే ముందు విజయ్‌ దేవరకొండ, తరువాత విష్ణు విశాల్‌ సైతం న్యూడ్‌ ఫోటోలకు పోజులిచ్చి హాట్‌ టాపిక్‌గా మారారు. హాలీవుడ్ స్టార్స్ కొంత మంది ఇలాంటి న్యూడ్ ఫొటో షూట్స్ చేశారు. బాలీవుడ్‌లో ఇటువంటి షూట్స్ చేసిన వారి చాలా తక్కువ మంది ఉన్నారు.

మరోవైపు ఈ ఫోటోషూట్‌పై వివాదాలు, విమర్శలు కూడా చుట్టుముట్టాయి. తాజాగా నగ్న షోటోషూట్‌ నటుడిని చట్టపరమైన చిక్కుల్లో పడేసింది. ఇప్పుడు రణవీర్ సింగ్ ట్రెండ్ ను ఫాలో అవుతూ మరికొంతమంది హీరోలు సెమీ న్యూడ్ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు గాను రణవీర్ సింగ్ పై పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. చెంబూర్ పోలీస్ స్టేషన్ లో ఓ ఎన్జీవో రణవీర్ పై ఫిర్యాదు చేసింది. అదే ఒక మహిళ ఇలాగే ఫోటోషూట్‌ చేస్తే ప్రశంసిస్తారా అని టీఎమ్‌సీ ఎంపీ, బెంగాలీ నటి మిమీ చక్రవర్తి ప్రశ్నించారు.

మహిళల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఈ ఫొటోలు ఉన్నాయని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అలానే ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ల కింద నటుడిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసినవారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రణవీర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -