- మహారాష్ర్టలో విలయతాండం చేస్తున్న కరోనా వైరస్
కరోనా వైరస్ మహారాష్ర్ట పోలీసులను వదలడం లేదు. రోజు రోజుకు పోలీసు శాఖలో పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 511 మంది పోలీసులకు కరోనా పాజటివ్‌గా తేలింది. దీంతో 7 మంది పోలీసులు మరణించినట్లు మహారాష్ర్ట పోలీసు శాఖ ప్రకటిచింది. ఇప్పటివరకు రాష్ర్టంలో 16,912 మంది పోలీసులకు కరోనా సోకగా 3020 యాక్టివ్ కేసులు, 13,719 మంది కోలుకున్నారని పోలీసు శాఖ పేర్కొంది. అయితే మహారాష్ర్టంలో మొత్తం 173 మంది పోలీసులు కరోనా కారణంగా మృతి చెందినట్లు విచారం వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా రాష్ర్టంలో గత 24 గంటల్లో 20,800 పాజిటివ్ కేసులు రాగా, 312 మంది మృత్యువాత పడ్డారు. 2,21,012 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు 26,276 మంది కరోనా బాధితులు మృతి చెందినట్లు సమాచారం.