కంచ గచ్చబౌలి భూముల(Kancha Gachibowli lands Issue) విషయంలో సోషల్ మీడియా వేదిక(Social Media)గా తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్(Senior IAS Smitha Sabarwal) తప్పుడు వీడియోలు ట్యాగ్ చేశారనే అభియోగాలపై ఈ నెల 12న గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈవిషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 179 కింద ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Policestation) ఎస్‌హెచ్‌వో మహ్మద్ హబీబుల్లా ఖాన్ స్పష్టం చేశారు. భూముల వ్యవహారంలో ఇప్పటికే అనేక మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజాగా సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌కు సైతం నోటీసులు జారీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆమె ఏం పోస్ట్ చేశారంటే…? మార్చి 31న హాయ్ హైదరాబాద్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ఖాతా నుంచి పోస్ట్ చేసిన గిబ్లి తరహాలో ఉన్న ఇమేజ్‌ని స్మితా సబర్వాల్ రీట్వీట్ చేశారు. ఈ ఫొటో ఫేక్ ఇమేజ్ అని పోలీసులు గుర్తించారు. ఈ కారణంతోనే ఆమెకు నోటీసులు జారీ చేశారు. త్వరలో ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.