end

సబ్బు బిళ్ళ పై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చిత్రం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో భారతదేశ,15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీమతి ద్రౌపది ముర్ము చిత్రం సబ్బు బిళ్ళ మీద వేసి సంతోషాన్ని వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారత మాత ముద్దు బిడ్డ ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పదవి చేపట్టటం గొప్ప విషయమని అన్నారు. దేశచరిత్ర లోనే తొలి గిరిజిన మహిళ ప్రమాణ స్వీకారం చేయడం యావత్ గిరిజిన జాతికి గర్వకారణం. ప్రమాణ స్వీకారం కారణం గా గిరిజిన పాఠశాల లో మిఠాయి పంచి పెట్టారు. టీచర్ స్థాయి నుండి దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపతి ముర్ము కి అవకాశం దక్కడం సంతోషంగా ఉంది అన్నారు.

Exit mobile version