end
=
Monday, November 11, 2024
వార్తలుజాతీయంBJP:ఉప ఎన్నికల్లో బీజేపీకే సానుకూల ఫలితాలు..
- Advertisment -

BJP:ఉప ఎన్నికల్లో బీజేపీకే సానుకూల ఫలితాలు..

- Advertisment -
- Advertisment -

  • ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల పోటీ
  • 4 బీజేపీ, 3 స్థానాలు ప్రాంతీయ పార్టీల సొంతం

2022 నవంబరు 6న దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో (States) జరిగిన 7 అసెంబ్లీ (Assembly)స్థానాల ఉప ఎన్నికల (by poll) ఫలితాలు (Result) వచ్చేశాయి. స్థానిక పార్టీలతో తగ్గపోరు పోటిని ఇచ్చిన జాతీయ పార్టీ బీజేపీకి (BJP)సానుకూల ఫలితాలు వచ్చాయి. తెలంగాణలోని (Telangana) మునుగోడు (Munugode)ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి నిరాశ కలిగించినప్పటికి.. మిగిలని చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి సానుకూల ఫలితాలు రాగా మహారాష్ట్రలో (Maharashtra) ఉద్ధవ్‌ థాక్రేకు (Uddhav Thackeray )ఊరటనిచ్చింది.

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి నిరాశ కలిగించినప్పటికి.. మిగిలని చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో జరిగిన 7 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు కూడా నవంబర్ (November) ఆరో తేదీ ఆదివారం (6 Sunday) వెలువడ్డాయి. నాలుగు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన వాటిల్లో మహారాష్ట్రలో శివసేన (ఉద్ధవ్‌ థాక్రే వర్గం) , తెలంగాణలో టీఆర్‌ఎస్‌ (TRS), బిహార్‌లో (BIHAR) రెండింటిలో ఒక స్థానాన్ని ఆర్‌జేడీ(RJD) దక్కించుకున్నాయి. తెలంగాణలో మునుగోడుతో పాటు, మహారాష్ట్రలోని అంధేరీలో (Antheri), బిహార్‌లో మొకామా, గోపాల్‌గంజ్, ఒడిశాలోని ధామ్ నగర్, హర్యానాలోని అదమ్‌పుర్, ఉత్తరప్రదేశ్‌లోని గోలా గోక్రానాథ్ (Mokama, Gopalganj, Dhamnagar in Odisha, Adampur in Haryana, Gola Gokarannath in Uttar Pradesh)స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలవగా, అంధేరీలో శివసేన(ఉద్ధవ్‌ థాక్రే వర్గం)(Shiva sena) అభ్యర్థులు గెలుపొందారు. బిహార్ లోని మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి, గోపాల్ గంజ్ (Gopal gunz)లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఒడిశాలోని ధామ్ నగర్ (Dhamnagar in Odisha) శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది.

ఉత్తరప్రదేశ్‌లో గోలా గోక్రానాథ్‌లో బిజేపీ గెలిచింది. మహారాష్ట్రలోని అంధేరి తూర్పులో శివసేన(ఉద్ధవ్‌ థాక్రే వర్గం)కు చెందిన రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్థి స్వతంత్య్ర అభ్యర్థి రాజేష్ త్రిపాఠి (Rajesh Tripathi)పై 64,959 ఓట్ల తేడాతో గెలుపొందారు. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి కుసుందేవి (Kusum Devi)సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తా (Mohan Prasad Gupta)పై 1794 ఓట్ల తేడాతో గెలుపొందగా.. మొకామా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి నీలం దేవి (Neelam Devi)సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సోనం దేవి (Sonam devi)పై 16,741 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఉత్తరప్రదేశ్‌లోని (UP)గోల గోకరనాథ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అమన్‌గిరి (Amangiri) సమీప ప్రత్యర్థి సమాజ్‌వాది (Samajwadi party)పార్టీ అభ్యర్థి వినయ్ తివారి (Vinay tiwari)పై 34298 ఓట్ల తేడాతో గెలుపొందారు.

(Cricket:సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లకు కొత్త నిబంధనలు)

ఒడిశాలోని ధామ్‌నగర్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సూర్యవంశీ సూరజ్ (Suryavanshi Suraj)సమీప ప్రత్యర్థి బిజు జనతాదళ్ అభ్యర్థి అబంతిదాస్ (Ambathidass)పై 9,881 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. హర్యానాలోని ఆదంపూర్‌ అసెం‍బ్లీ స్థానంలో బీజేపీకి చెందిన భవ్య బిష్ణోయ్ (Bhavya bishnoi) 15,740 ఓట్ల తేడాతో కాంగ్రెస్ (Congress party) పార్టీ అభ్యర్థి జై ప్రకాశ్ (Jai prakash)పై విజయం సాధించారు. తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి (Prabhakar reddy)సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ (Rajagopal)  రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో గెలుపొందారు.తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితం బీజేపీకి నిరాశ కలిగించినప్పటికి.. మిగిలని చోట్ల జరిగిన ఉప ఎన్నికల్లో కమలం పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇదిలావుంటే.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామేనంటున్న కాంగ్రెస్ (CONGRESS)మునుగోడు ఉప ఎన్నికలో చేతులెత్తేసింది. పోలింగ్ (Poling)ముగిసే వరకు తమదే గెలుపంటూ ధీమా వ్యక్తం చేసిన హస్తం పార్టీ ఫలితం చూశాక నోరెళ్లబెట్టింది. ఎన్నిక ఏదైనా మేము ఇంతే అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తయారైంది.

మునుగోడు ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ కు ఆశించిన ఫలితం దక్కలేదు. ఎన్నిక ఏదైనా ఓటమే తన గమ్యమన్నట్టుగా తయారైంది వృద్ధ పార్టీ పరిస్థితి. పేరుకే తెలంగాణ ఇచ్చిన పార్టీ.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఎన్నికలోనూ సత్తా చాటింది లేదు. 2014 నుంచి పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. 2018 తర్వాత జరిగిన హుజుర్‌నగర్‌ (Huzur nagar), దుబ్బాక (Dubbaka), నాగార్జున్‌ సాగర్‌ (Nagarjuna sagar) , హుజురాబాద్ (huzurabad) ఇలా ఎన్ని ఉప ఎన్నికలు వచ్చినా ఉసూరుమనిపించింది. తాజాగా మునుగోడులో అదే తీరు ఫలితాలను మూటగట్టుకుంది హస్తం పార్టీ. ఏ రౌండుచూసినా ఏడున్నది కాంగ్రెస్‌.. అన్నట్టుగా ఉన్నాయ్‌ హస్తం పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల సంఖ్య. మొత్తంగా కలిపితే 20వేల ఓట్లు సాధించేందుకు కూడా అపసోపాలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీనికి స్వయంకృతాపరాధమే కారణమన్నది విశ్లేషకుల మాట. చెప్పాలంటే మునుగోడు.. బీజేపీ సీటు కాదు. టీఆర్‌ఎస్‌ సీటూ కాదు. 2018లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అభ్యర్థిగా కాంగ్రెస్‌ గెలిచిన సీటు. ఆ రాజగోపాల్‌రెడ్డే పార్టీకి రాంరాం చెప్పేసి వెళ్లిపోవడంతో.. పరిస్థితి ఇలా తయారైంది. ఆయన వెంట మొత్తం వెళ్లకపోయినా మెజార్టీ స్థాయిలో క్యాడర్‌ మాత్రం కదిలివెళ్లిందన్నది మాత్రం కాంగ్రెస్‌ గ్రహించాల్సిన కఠినవాస్తవం.

(Burping:నిరంతర తేన్పులతో ప్రాణాంతక వ్యాధి..)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -