end
=
Tuesday, January 21, 2025
క్రీడలుపవర్ లిఫ్టింగ్ ఛాంపియన్
- Advertisment -

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్

- Advertisment -
- Advertisment -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ – 2022 లో తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా స్ట్రాంగ్ విమెన్ గా ఎంపికైన శ్రీమతి మల్లిక రాఘవేందర్ గౌడ్ ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ రంజిత్ రెడ్డి, రాజేంద్ర నగర్ శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ గౌడ్ గార్లతో కలసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి సమగ్రమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగా దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీ ని రాష్ట్రంలో రూపొందిస్తున్నా మన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా క్రీడాకారులను, కోచ్ లను ప్రోత్సహిస్తున్నామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించేలా రాష్ట్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ను అందిస్తున్నామన్నారు.

పవర్ లిఫ్టింగ్ లో గత 5 సంవత్సరాల నుండి నిలకడగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలను సాధిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెస్తున్న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన శ్రీమతి. మల్లికా రాఘవేందర్ గౌడ్ ను అభినందించారు. రాష్ట్ర క్రీడా శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. చేవెళ్ల MP శ్రీ రంజిత్ రెడ్డి, MLA ప్రకాష్ గౌడ్ ల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి మల్లిక రాఘవేందర్ గౌడ్ గారికి క్రీడాకారులకు అందించే ప్రోత్సాహకాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -