end
=
Tuesday, April 15, 2025
సినీమాఆ నెల‌లో సెట్స్‌పైకి `స్పిరిట్‌`
- Advertisment -

ఆ నెల‌లో సెట్స్‌పైకి `స్పిరిట్‌`

- Advertisment -
- Advertisment -

చేతి నిండా సినిమాలతో ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు ప్రభాస్(Prabhas). ఆయన కథానాయకుడిగా నటిస్తున్న వాటిల్లో ‘స్పిరిట్’(Spirit Movie) ఒకటి. ఈ చిత్న్రాన్ని సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అప్డేట్ గురించి ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి అనుకున్నదానికన్నా ఎక్కువ సమయం పట్టడంతో చిత్రీకరణ(Film Making) ఆలస్యమవుతోంది. అయితే, ఇటీవల ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతోది. ఫిల్మ్‌నగర్(Film nagar) వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా అక్టోబర్‌లో సినిమాను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని సమాచారం. ఇది సాధారణ పోలీసు థ్రిల్లర్ కాదట.. ఈ మూవీతో సందీప్‌రెడ్డి వంగా కాప్ డ్రామాల్లోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్నాడని చెప్పుకొంటున్నారు. ఈ ప్రాజెక్టు ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కూడా చేసుకోనున్నారని సమాచారం. ప్రభాస్ గత సినిమాల్లోని స్టంట్స్‌ను ఎక్కువగా డూప్స్ చేసేవారట. కానీ ‘స్పిరిట్’లోని ఎక్కువ శాతం స్టంట్స్‌ను ప్రభాస్‌తో చేయించాలనేది దర్శకుడి ఆలోచనగా ఉందట. ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజాసాబ్’ కోసం పనిచేస్తున్నారు. ఆ తర్వాత ‘ఫౌజీ’ని పూర్తి చేయనున్నారట. ఆ తర్వాతే ప్రభాస్ ‘స్పిరిట్’పై దృష్టి సారిస్తారని టాక్. 2027లో విడుదల చేయనున్న ఈ సినిమాను భూషణ్‌కుమార్.. సందీప్‌రెడ్డి వంగా, ప్రణయ్‌రెడ్డి వంగాలతో కలిసి నిర్మిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -