end

డార్లింగ్ విడుదల చేసిన….

‘అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ రిలీజ్ చేసిన డార్లింగ్.. అదరగొట్టిన రెజీనా, నివేదితా
అన్య’స్ ట్యుటోరియల్ వెబ్ సిరీస్ టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశారు. హర్రర్ జోనర్‌లో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించగా.. రెజీనా, నివేదితా తమ యాక్టింగ్‌తో అదరగొట్టినట్లు తెలుస్తోంది. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలుగా చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ”అన్య’స్ ట్యుటోరియల్”. థ్రిల్లింగ్ హర్రర్ జోనర్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మాణ సంస్థ నిర్మిచింది. జులై 1 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా నిర్మించారు.
టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ టీజర్ లాంచ్ చేయడం తనకు సంతోషంగా ఉందని చెప్పాడు. ”అన్య’స్ ట్యుటోరియల్” ట్యూటోరియల్ టీమ్‌కు అభినందనలు తెలిపాడు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ రంగం వైపు అడుగులు వేస్తుంది.. కానీ అదే డిజిటల్ రంగం అందరిని భయపెడితే..? ఎలా ఉంటుందనే లైన్ తీసుకుని ‘అన్య’స్ ట్యుటోరియల్‌ను డిజైన్ చేశారు. అన్య (నివేదితా సతీష్), మధు (రెజీనా కెసాండ్రా) అక్కాచెల్లెళ్లు. అన్య ఒక సోషల్ ఇన్‌ఫ్లియెన్సర్ కావాలని ప్రయత్నిస్తుంటుంది. తన చెల్లి మధు ప్రొఫెషన్ అంటే అన్యకు అస్సలు నచ్చదు. కానీ అనుకోకుండా ఒక రోజు మొత్తం మారిపోతుంది.. ఎవరూ చూడని విధంగా సైబర్ ప్రపంచం మొత్తం భయపడుతుంది.. అసలు ఎందుకు ఏమిటి ఇలా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ‘అన్య’స్ ట్యుటోరియల్’ చూడాల్సిందే. అద్భుతమైన నేపథ్య సంగీతంతో టీజర్ థ్రిల్లింగ్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తిస్తుంది మరియు తర్వాత ఏమి జరుగుతుంది. ఉత్కంఠభరితంగా సాగే ఈ వెబ్‌ సిరీస్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పల్లవి గంగిరెడ్డి ఈ సిరీస్‌తో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు.

Exit mobile version