ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరదపోటు తలెత్తింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 70 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు. అయితే బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3,13,834 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 3,01,056 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. బ్యారేజీ నిండుకుండలా జలకళ సంతరించుకుంది. కాలువల ద్వారా 10,356 క్యూసెక్కులు నీటి విడుదల చేశారు. (సింగూరుపై రైతుల్లో కొత్త ఆశలు)
నదీ పరీవాహక లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తారకరామానగర్, భవానీపురం, భూపేస్‌గుప్తానగర్, రణదివినగర్, విద్యాధరపురం తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
(సెంట్రల్ రైల్వేలో 432 అప్రెంటిస్ ఖాళీలు)
ఇదేగాకుండా అత్యవసర పరిస్థితుల దృష్ట్యా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అలాగే నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.