end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌వంటలుఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ
- Advertisment -

ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర తయారీ

- Advertisment -
- Advertisment -

వంకాయ పైన ఎగిరే పావురమా సినిమాలో ఒక పాట కూడా ఉంది. తాజాగా కూరగాయల్లో రాజా ఎవరంటే వంకాయని అని సాంగ్ ఉంది. వంకాయ అంతా రుచిగా ఉంటుంది. వంకాయ కూర అంటే తెలుగు వారు ప్రాణం పెట్టేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వంకాయ ప్రముఖ కూరగాయ. ఉల్లి కారం పెట్టిన గుత్తి వంకాయ కూర అంటే ఎవరికైనా నోరు ఊరుతుంది. ఎలా చేయాలో తెల్సుకుందాం.

ఉల్లిపాయ ముక్కలు, దాల్చిన చెక్క , ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, అల్లం , వెల్లుల్లి, మిక్సీ వేసుకోవాలి. అనంతం ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకుని దానిలో కొంచెంకారం, గసగసాల పేస్ట్ ను వేసుకుని కలిపాలి. లేత వంకాయలను కడిగి పెట్టుకోవాలి. కట్ చేసుకున్నా వంకాయలను నీటిలో కొంచం ఉప్పు వేసి పెట్టాలి. వాటిని మధ్యలో ప్లస్ లాగ కోసి (పురుగులు లేకుండా చూసుకోవాలి) అందులో ఈ మసాలా పెట్టాలి.తర్వాత ఒక ప్యాన్ పెట్టి నూనె వేడి చేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వెయించి మసాలా పెట్టుకున్న వంకాయలను వేసి మూత పెట్టుకోవాలి. వంకాయలు నూనెలో బాగా మగ్గిన తర్వాత మసాలా వేసి మూత పెట్టీ వేగనివ్వాలి.బాగా వేగిన కాసిని నీళ్ళు పొసి వుడికించుకోవలి. కూర కలిపే సమయంలో గుత్తి వంకాయలు విరగకుండా చూస్తూ కలుపుకోవాలి. చివరలో ఉప్పు, కారం రుచి చూసి కొత్తిమీర వేసి దింపాలి. ఈ ఉల్లి మసాలా గుత్తి వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండగలమా.. !

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -