end
=
Saturday, July 6, 2024
వార్తలుజాతీయంTamil Nadu:లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకండి
- Advertisment -

Tamil Nadu:లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకండి

- Advertisment -
- Advertisment -

  • పార్టీనేతలకు పిలుపునిచ్చిన తమిళనాడు సీఎం స్టాలిన్

తమిళనాడు డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీనేతలకు పిలుపునిచ్చాడు. తేనాంపేట (Teynampet)లోని డీఎంకే (DMK) ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో 23 విభాగాల నేతలతో బుధవారం ఉదయం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ పాలనపై జరుగుతున్న దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని కార్యకర్తలను అలర్ట్ చేశాడు. ఈ మేరకు విద్యార్థి, కార్మిక, జాలర్ల, సాహిత్య, చేనేత, వైద్య, న్యాయవాదుల, మైనారిటీ (Student, Laborer, Fisherman, Literary, Handicraft, Medical, Lawyer, Minority) తదితర 23 విభాగాలకు చెందిన 416 మంది, ఎన్నికల కమిటీ నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్టాలిన్‌ ప్రసంగిస్తూ జిల్లాస్థాయిలో పార్టీకి చెందిన వివిధ విభాగాలకు ఎన్నికలను జరిపి కొత్త కార్యవర్గాలను ఎంపిక చేసుకునే బాధ్యత జిల్లా కార్యదర్శుల (District Secretaries)దేనన్నారు. రాష్ట్రమంతటా 23 విభాగాల పనితీరుపై నిఘా వేసేందుకు డిప్యూటీ కార్యదర్శులు ఐ.పెరియసామి, పొన్ముడి, కనిమొళి, ఎ.రాజాలను ఇన్‌చార్జ్‌లుగా (Deputy Secretaries I.Periyasamy, Ponmudi, Kanimozhi, A.Raja as in-charges)నియమిస్తున్నామన్నారు. గత లోక్‌సభ ఎన్నికల నుంచి స్థానిక ఎన్నికల వరకూ పార్టీ ఘనవిజయం సాధించిందని, ఇదే రీతిలో పార్టీ శ్రేణులంతా 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి సహా 40 నియోజకవర్గాల్లో డీఎంకే కూటమి విజయం సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్నాడీఎంకే, బీజేపీ (DMK, BJP)సాగిస్తున్న దుష్ప్రచారంపై ఎదురుదాడి చేయాలని, విమర్శలకు వివరణ ఇచ్చి తిప్పి కొట్టాలని సూచించారు. ముఖ్యంగా డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని కోరారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి గెలుపే లక్ష్యంగా బీజేపీ అవినీతి, అక్రమాలకు పాల్పడే అవకాశాలున్నాయని, ఈ విషయంలో డీఎంకే జిల్లా నేతలు అప్రమత్తంగా వ్యహరించాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. బూత్‌ కమిటీల (Bhoot comiti) నిర్వాహకులను ఎంపిక చేయడంలోనూ జిల్లా కార్యదర్శులు ఆచితూచి వ్యవహరించాలని తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ (Duraimurugan,), కోశాధికారి టీఆర్‌ బాలు ( Treasurer TR Balu,), వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి (Founder Secretary RS Bharti,), డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కనిమొళి ( Deputy General Secretaries Kanimozhi,) ఐ.పెరియసామి ( I.Periyasamy,), కె.పొన్ముడి ( K.Ponmudi,), ఎ.రాజా (A.Raja) అధికార ప్రతినిధి టీకేఎస్‌ ఇళంగోవన్‌ (Spokesperson TKS Ilangovan,) ప్రధాన కార్యాలయం కార్యదర్శులు పూచ్చి మురుగన్‌, ( Head Office Secretaries Poochi Murugan, )హార్బర్‌ కాజా (Harbor Kaja,), కేకే సెల్వం (KK Selvam.) తదితరులు హాజరయ్యారు.

అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తన మిత్ర పక్షం కాంగ్రెస్‌ (Congress) సత్తాపై గట్టి నమ్మకంతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తన ప్రాధాన్యాన్ని కోల్పోలేదని చెప్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో (BJP)తలపడేందుకు కాంగ్రెస్‌తో కూడిన జాతీయ కూటమి ఉండాలని అంటున్నారు. కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ (Stalin)మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కోల్పోయిందనడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడిన జాతీయ కూటమి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి గాడిలో పడుతోందని, భారత దేశానికి ఇప్పుడు అదే అవసరమని చెప్పారు. ఆ పార్టీ పునరుజ్జీవం బాటలో ఉందన్నారు.

కాంగ్రెస్ (Congress) నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని సోదరునిగా అభివర్ణిస్తూ, బీజేపీ (BJP) అనుసరించే సంకుచిత రాజకీయాలకు మేలైన విరుగుడు మందు వంటివారు సోదరుడు రాహుల్ గాంధీ అని స్టాలిన్ (MK Stalin) అన్నారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా పని చేసే విధంగా చూడటం కోసం జాతీయ కూటమి ఏర్పాటవడం చాలా ముఖ్యమని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో బలమైన ప్రాంతీయ పార్టీతో జాతీయ పార్టీ పొత్తు పెట్టుకోవడమనే తమిళనాడు నమూనాను ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించవచ్చునని తెలిపారు. రాహుల్ గాంధీ బీజేపీతో కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికపై కూడా పోరాడుతున్నారన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) భారీ సంచలనం సృష్టించిందన్నారు.

రాజకీయంగా కాంగ్రెస్ క్షీణిస్తుండటానికి కారణాలేమిటని భావిస్తున్నారని ప్రశ్నించినపుడు స్టాలిన్ స్పందిస్తూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యం కోల్పోయిందనడాన్ని తాను అంగీకరించనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి సోనియా గాంధీ (Sonia Gandhi) తీసుకున్న చర్యల ఫలితాలు రావడం ప్రారంభమైందన్నారు. సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తన విశేష అనుభవంతో పార్టీని పునరుజ్జీవం దిశగా నడుపుతున్నారని చెప్పారు. భారత్ జోడో యాత్ర ప్రభావం దేశవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మవిశ్వాసం అత్యున్నత స్థాయిలో ఉందన్నారు.కాంగ్రెస్, డీఎంకే (Congress, dmk) పొత్తు వల్ల కలిసొచ్చిందనుకుంటున్నారా? భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుందా? అని అడిగినపుడు స్టాలిన్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని తాము బలంగా భావిస్తున్నామన్నారు. మన దేశ ఫౌండింగ్ ఫాదర్స్ మనకు అప్పగించిన మౌలిక విలువలు, సిద్ధాంతాలు నిర్వీర్యం కాకూడదన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు స్వతంత్రంగా పని చేయాలని కోరుకునే తమ వంటివారంతా కాంగ్రెస్‌తో కూడిన జాతీయ కూటమి ఉండాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

(తెలంగాణలో 185 వెటర్నరీ పోస్టులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -