end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయండీజిల్‌పై రూ.25 పెంపు...!
- Advertisment -

డీజిల్‌పై రూ.25 పెంపు…!

- Advertisment -
- Advertisment -
  • బల్క్‌ యూజర్లకు మాత్రమే వర్తింపు
  • సామాన్య ప్రజలకు పాత రేట్లే

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా విక్రయించే డీజిల్‌ ధర లీటరుకు రూ.25 పెరిగింది. అయితే ఇది కేవలం Bulk Users పెద్ద వినియోగదారులకు మాత్రమే. అంతేగానీ సాధారణ వినియోగదారులకు ఇది వర్తించదని సంబంధిత అధికారులు తెలిపారు. బల్క్‌ యూజర్లు పెద్ద మొత్తంలో ఒకేసారి డీజిల్‌, పెట్రోల్‌ కొనుగోళ్లు చేస్తారు. వీరికి సామాన్య వినియోగదారుల రేట్లతో పోలిస్తే ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ అధిక ధరలను తప్పించుకోవడానికి బల్క్‌ యూజర్లు కూడా సాధారణ రిటైల్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేయడం ద్వారా పెద్ద సమస్య ఏర్పడింది. ఇది రిటైల్‌ వ్యాపారులకు, వినియోగదారులకు నష్టం కలిగిస్తుంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర భారీగానే పెరిగింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం డీజిల్‌, పెట్రోల్‌ ధరలు కనీసం 12 నుండి 15 రూపాయల వరకు పెంచే ఆలోచనలో ఉండడంతో సాధారణ ప్రజలు భయపడుతున్నారు.

షెల్‌, జియో-బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేటు రిటైల్‌ విక్రయ సంస్థలు భారీ ఎత్తున నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్‌ ఆయిల్‌, భారత్‌ పెట్రోల్‌ రాయితీ ధరకు ముడి చుమురు పొందుతున్నాయి. కానీ ప్రైవేటు రిటైల్‌ సంస్థలకు రాయితీలు లేక పోటీపడలేకపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రైవేటు రంగ పెట్రోల్‌ బంక్‌లను మూసివేయకతప్పదని పరిశ్రమల వర్గాలు ఆందోళన పడుతున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ సంస్థల పోటీ తట్టుకోలేని రిలయన్స్‌ సంస్థ దేశ వ్యాప్తంగా తన బంక్‌లను మూసివేసింది. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే కనబడుతున్నాయని పలువురు రిటైల్‌ సంస్థల అధికారులు భావిస్తున్నారు.

అయితే పెద్ద వినియోగదారులు (Bulk Users ) పెట్రోల్‌బంక్‌ల వద్దకు వెళ్లకుండా ఉండేందుకు ప్రత్యేకంగా వీరికి మాత్రమే ధరలను పెంచాయి. దీంతో ముంబయ్‌లో బల్క్‌ యూజర్లకు డీజిల్‌ లీటరుకు రూ.122.05కు చేరింది. కాగా సామాన్య వినియోగదారులకు మాత్రమే ధర రూ.94.14గా కొనసాగుతుంది. ఢిల్లీలో లీటరు డీజిల్‌కు రూ.115, సాధారణ ప్రజలకు రూ.86.67గా ఉన్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -