నవంబరు 11 విశాఖపట్నం రైల్వే స్టేషన్ శంకుస్థాపన
12న తెలంగాణ రామగుండం ఎరువుల కర్మాగారం
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ఈ నెల నవంబరు (November)11, 12 తేదిల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) పర్యటించనున్నారు. మొదటగా నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో (Visakhapatnam)పర్యటించనుండగా 400 కోట్ల రూపాయలతో చేపట్టనున్న రైల్వే స్టేషన్ (Railway station)నవీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ (Central Government)శాఖలకు సంబంధించిన కార్యక్రమాలకూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో (AU Engineering College) నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం జగన్‌తో (CM Jgan)పాటుగా గవర్నర్ బిశ్వభూషణ్ (Governor Biswabhusan) ప్రధాని పర్యటనలో పాల్గొనున్నారు.
ఆ తర్వాత నవంబరు 12న మోడీ తెలంగాణలో (Telangana)పర్యటించనుండగా రామగుండం ఎరువుల కర్మాగారాన్ని (Ramagundam Fertilizer Factory) జాతికి అంకితం చేయనున్నారు. బేగంపేట ఎయిర్ పోర్ట్ (Begumpet Airport)కు ప్రత్యేక విమానంలో రానున్న ప్రధాని.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో రామగుండం చేరుకుంటారు. ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన కారణంగా రాష్ట్ర ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Somesh Kumar) సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను అత్యంత పకడ్బందీగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేదికల వద్ద సెక్యూరిటీ (Security), శాంతి భద్రతల విషయంలో రాజీ పడకూడదని చెప్పారు. అయితే ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ (CM KCR)హాజరవుతారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలాగే ప్రధాని మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలు ఆందోళనలకు సిద్ధమయ్యాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
(Kommineni Srinivasa Rao : ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు)
Gujarat Election 2022:
ఇదిలావుటే.. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో (Gujarat) ఎన్నికల (Election) సందడి మొదలైంది. డిసెంబర్‌లో (December) రెండు విడతల్లో 182 నియోజకవర్గాలకు పోలింగ్ (Polling for 182 constituencies) జరగనుంది. కొన్నేళ్లుగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)మధ్య మాత్రమే ఉన్న పోటీలోకి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party)ఎంటర్ అయింది. దీంతో గుజరాత్ రాజకీయం ఆసక్తిగా మారింది. ఢిల్లీ (Dellhi) తర్వాత పంజాబ్ (Panjab)ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ లోనూ చరిత్ర సృష్టించబోతుందా, కమలం పార్టీని గట్టిగా ఢీకొట్టబోతుందా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ దూకూడుతో కాంగ్రెస్ పార్టీ సైతం ఆందోళన చెందుతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గత 25 సంవత్సరాలుగా (25 Years) గుజరాత్‌ను పాలిస్తున్న బీజేపీ.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
పార్టీలో సమూల మార్పులు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharath jodo yatra)తో ఈ సారి గుజరాత్‌ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తుంటే.. ప్రధాని సొంత రాష్ట్రంలో సత్తా చాటి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్లాన్‌తో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకెళ్తోంది. గుజరాత్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి వ్యూహలకు వారు పదును పెడుతున్నారు. సుదీర్ఘ కాలంగా గుజరాత్‌లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగానే చాలా కాలం పోటీ సాగింది. ఇప్పటివరకు గుజరాత్‌లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, లేదంటే బీజేపీ ప్రభుత్వం మధ్యలో జనతా పార్టీ (Janata Party), జనతా దళ్ (Janata Dal), రాష్ట్రీయ జనతా దళ్ (Rashtriya Janata Dal) పార్టీలకు చెందిన వ్యక్తులు ముఖ్యమంత్రులుగా పనిచేసినా, స్వల్ప కాలం మాత్రమే వారు పదవిలో ఉన్నారు. 2017 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) బీజేపీ, వర్సెస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ జరిగింది. ఇప్పుడు గుజరాత్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఆమ్ ఆద్మీ పార్టీ మారింది. గుజరాత్ కురుక్షేత్రంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి.
ఢిల్లీ (Dellhi)తర్వాత పంజాబ్‌లో (Panjab) ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ప్రస్తుతం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ (Himachalpradesh)ఎన్నికల్లో (elections) పోటీ చేస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లో పోటీచేస్తున్నప్పటికి ప్రధాన ఫోకస్ మాత్రం గుజరాత్ పైనే పెట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇటీవల కాలంలో ప్రతి నెలలో వీలైనన్ని ఎక్కువ సార్లు ఢిల్లీ సీఏం అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) గుజరాత్‌లో పర్యటిస్తూ.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న వర్గాలను తమ పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. గుజరాత్‌లో బీజేపీకి సంప్రాదాయ ఓటు బ్యాంకు (Vote bank)ఉంది. అలాగే కాంగ్రెస్‌కు కూడా క్షేత్రస్థాయి బలం ఉంది. గత కొన్నేళ్లుగా హస్తం పార్టీ బలహీనపడటంతో.. అక్కడ బలపడేందుకు అరవింద్ కేజ్రీవాల్ తనదైన వ్యూహలతో అడుగులు వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటిటే దీని ప్రభావం 2024 సాధారణ ఎన్నికలపై ఉంటుందనేది కేజ్రీవాల్ వ్యూహంగా అర్థమవుతుంది. ఇక గుజరాత్‌లో ఓ ప్లాన్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుతూ వస్తోంది.
1998 నుంచి 25 ఏళ్ల పాటు బీజేపీ గుజరాత్‌లో అధికారంలో ఉంటూ వస్తోంది. సాధారణంగా దీర్ఘ కాలం పాలించిన ఏ ప్రభుత్వంపై అయినా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించడం సహజం. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను (Votes) పొందడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందుతుండటం, నాయకత్వ లోపంతో హస్తం పార్టీ గుజరాత్‌లో అనుకున్నంత ఫెర్ఫార్మెన్స్ (performance) ఇవ్వకపోతుండటంతో.. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు ఆప్ గత కొనేళ్లుగా తన ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎదుగుదల హస్తం పార్టీకి నష్టమేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. గుజరాత్‌లో డిసెంబర్ (December) 1వ తేదీన మొదటి దశ, 5వ తేదీన రెండో విడతలో ఎన్నికలు జరగనుండగా, 8వ తేదీన ఓట్లు లెక్కిస్తారు. ఎప్పుడూ ద్విముఖ పోరు కనిపించే గుజరాత్‌లో ఈ సారి త్రిముఖ పోటీ తప్పదనే అంచనాలు ఉన్నాయి.