end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంప్రధాని నోట గురజాడ మాట..
- Advertisment -

ప్రధాని నోట గురజాడ మాట..

- Advertisment -
- Advertisment -

ఢిల్లీ: ఇవాళ్టి నుంచి దేశంలో కోవిడ్‌ టీకాను ఇవ్వనున్న విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ.. ప్రముఖ ప్రఖ్యాత తెలుగు కవి గురజాడ అప్పారావును గుర్తు చేసుకున్నారు. తన ప్రసంగంలో గురజాడ ‘దేశభక్తి’ గేయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ గేయంలోని ‘సొంత లాభం కొంత మానుకొని.. పొరుగువారికి తోడ్పడవోయ్, దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’ అన్న వాక్యాలను ప్రధాని వినిపించారు. దేశం గురజాడ సిద్ధాంతాన్ని ఆచరించిందని.. అందుకే టీకా త్వరగా ప్రజల చెంతకు చేరిందని మోదీ అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఒక్కరు విధిగా వ్యాక్సిన్ రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వచ్చిందని అజాగ్రత్తగా ఉండవద్దని ఈ సందర్భంగా ప్రధాని హెచ్చరించారు. టీకా వేసుకున్నప్పటికీ ప్రతి ఒక్కరు భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, శుభ్రత పాటించడం తప్పనిసరని సూచించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -