end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంపోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్‌
- Advertisment -

పోలీసుల అదుపులో ప్రియాంక, రాహుల్‌

- Advertisment -
- Advertisment -

కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ, నిరుద్యోగం వంటి సమస్యలకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా బయలుదేరిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శశి థరూర్‌లతో సహా కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు ఖండించినప్పటికీ కాంగ్రెస్ భారీ నిరసనను నిర్వహిస్తోంది.. పారామిలటరీ బలగాలు, ఢిల్లీ పోలీసులు విజయచౌక్‌ రోడ్డును, పార్లమెంట్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లే మార్గాన్ని బారికేడ్ల ద్వారా అడ్డుకున్నారు. కాంగ్రెస్ ఎంపీల నిరసనను అడ్డుకునేందుకు మహిళా పారామిలటరీ సిబ్బంది బారికేడ్లకు అటువైపు క్యూలో నిల్చున్నారు. నిరసనల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించాలని కాంగ్రెస్ భావించింది.. కాగా, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ.. ప్రస్తుతం భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని, మన దేశం నలుగురి నియంతృత్వ పాలనలో ఉందని అన్నారు.

నిరసనలకు ముందు ఢిల్లీ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుత నియంత పాలన నడుస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కనుమరుగైందని, ఆర్‌ఎస్ఎస్‌ దేశాన్ని నియంత్రిస్తోందని ఆరోపించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా ఇతర అంశాలపై కేంద్రానికి వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్. అన్ని రాష్ట్రాల్లోని నాయకులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వంటి నేతలు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -