పంజాగుట్ట సమీపంలోని శ్రీనగర్ కాలనీలో వ్యభిచారం గుట్టురట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు సెక్స్ వర్కర్లు, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనగర్‌కాలనీలోని శ్రీనివాసప్లాజాలో చాలా రహస్యంగా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారం మేరకు పంజాగుట్టా క్రైమ్ ఇన్‌స్పెక్టర్ టి.నర్సింహరాజు ముందుగా ఓ కానిస్టేబుల్‌ను కస్టమర్‌గా పంపించాడు. ఆ తర్వాత సమాచారం పక్కాగా ఉండడంతో దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఈస్ట్‌గోదావరికి చెందిన పి.దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ముఖ్య నిర్వాహకుడు కె.రాము పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువతులను రెస్క్యూహోంకు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.