end

Imran Khan:ఇమ్రాన్‌ఖాన్ పుస్తకావిష్కరణకు నిరసన సెగ

అనుమతి నిరాకరించిన బెంగుళూర్ పోలీసులు

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan)పై రాసిన పుస్తకం అవిష్కరణ (Launch of book) కార్యక్రమం రద్దయింది. గురువారం బెంగళూరులో (Bengalore) పుస్తకావిష్కరణ జరగాల్సి ఉండగా, హిందు (hindu) సంఘాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు (protest) వెల్లువత్తడంతో పోలీసులు అనుమతికి నిరాకరించారు. సుధాకర్ ఎస్బీ (Sudhakar SB)రచించిన ‘ఇమ్రాన్ ఖాన్: ఏ లివింగ్ లెజెండ్’(‘Imran Khan: A Living Legend’) బెంగుళూరులో అవిష్కరించాలని ముందుగా అనుకున్నారు. అయితే దీనికి హిందు సంఘాలు అడ్డుతగిలాయి. ‘ఇమ్రాన్ ఖాన్ దేశానికి శత్రువు రూపం. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో భారత్‌పై ద్వేషాన్ని ప్రదర్శించారు. ఆయన హయాంలో పూల్వామా దాడి (Pulwama attack)లో అనేక మంది సైనికులు  చనిపోయారు. దేశవ్యతిరేకికి చెందిన పుస్తకావిష్కరణకు మనం ఎందుకు అనుమతివ్వాలి’ అని హిందు జనజాగృతి సమితి (Hindu Janajagruti Samiti) ప్రతినిధి అన్నారు. పుస్తకావిష్కరణను రద్దు చేయడం విచారంగా ఉందని రచయిత సుధాకర్ అన్నారు. ఇలాంటి చర్యలు బెంగళూరులో పుస్తకావిష్కరణలను దూరం చేస్తాయని పేర్కొన్నారు. దాదాపు మూడున్నరేళ్లు అధ్యయనం చేసి ఆయన ఈ పుస్తకాన్ని రచించారు. అయితే ఈ సమయంలో ఆయన ఇమ్రాన్‌ఖాన్‌ను ఒక్కసారి కూడా కలవకపోవడం గమనార్హం.

ఇమ్రాన్ ఎడ్యూకేషన్ : (Imran Education)

1991లో అతను తన తల్లి జ్ఞాపకార్థం ( memory of mother) క్యాన్సర్ ఆసుపత్రిని (hospital)ఏర్పాటు చేయడానికి నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. 1994 లో లాహోర్లో (lahore)ఒక ఆసుపత్రిని స్థాపించడానికి $2.5 కోట్లు సేకరించాడు. 2015 లో పెషావర్లో రెండవ ఆసుపత్రిని స్థాపించాడు. ఖాన్ తన దాతృత్వ కార్యక్రమాలను కొనసాగిస్తూ, షౌకత్ ఖానుమ్ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి (Shaukat Khanum Memorial Cancer Hospital)ని ఒక పరిశోధనా కేంద్రంగా కూడా విస్తరించాడు. 2008 లో నామల్ (namal)కాలేజీని స్థాపించాడు. ఖాన్ 2005, 2014 మధ్య బ్రాడ్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ ఛాన్సలర్‌ (Chancellor of the University of Bradford)గా కూడా పనిచేశాడు. 2012 లో రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ (Royal College of Physicians)గౌరవ ఫెలోషిప్ అందుకున్నాడు.

(MLA Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ ఎత్తివేయలేం)

ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు: (ICC Cricket Hall of Fame)

ఇక ఆయన అసలు పేరు ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజి (Imran Ahmed Khan Niazi). కాగా పాకిస్తానుకు 22వ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీకి చైర్మన్. రాజకీయాల్లోకి రాకముందు, ఖాన్ అంతర్జాతీయ క్రికెటరు, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్. అతడి నేతృత్వంలో పాకిస్తాన్ 1992 క్రికెట్ ప్రపంచకప్‌ (world cup)సాధించింది. 1971 లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 18 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించాడు. ఖాన్ 1992 వరకు ఆడాడు. 1982, 1992 మధ్య జట్టు కెప్టెన్‌గా పనిచేశాడు. అత్యుత్తమ ఆల్ రౌండ్ ఆటగాడిగా పరిగణించబడుతున్న ఖాన్ టెస్ట్  ఐసిసి క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు .

రాజకీయ ప్రస్థానం :

2014 చివరిలో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని నిరసనలపై వాయిస్ ఆఫ్ అమెరికా (america)నివేదించింది ఖాన్ 1996 లో పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (Pakistan Tehreek-e-Insaf) (పిటిఐ) అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా (president)పనిచేశాడు. 2002లో జాతీయ అసెంబ్లీలో మియాన్వాలి సీటు గెలిచి 2007 వరకు ప్రతిపక్ష సభ్యుడిగా పనిచేశాడు. పిటిఐ 2008 లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించింది. తరువాతి ఎన్నికలలో రెండవ అతిపెద్ద ఓటును పొందింది. ప్రాంతీయ రాజకీయాల్లో, పిటిఐ 2013 నుండి ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించింది. 2018 లో ప్రధానిగా ఎన్నికైన తరువాత ఖాన్ తన నాయకత్వాన్ని సహచరులకు అప్పగించాడు. ప్రధానమంత్రిగా (prime minister) ఖాన్ 2018, 2019 మధ్య పాకిస్తాన్ రూపాయి విలువలో తరుగుదలను సమతుల్యం చేసేందుకు $16 బిలియన్లు అప్పు తీసుకున్నాడు. ఇది పాకిస్తాన్ ఏర్పడిన తరువాత ఓ ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న అత్యధికం బాహ్య రుణం. అవినీతిపై చాలా మందిపై సవాలు చేసిన ఇమ్రాన్ ఖాన్, ప్రజాస్వామ్య తిరోగమనం, మానవ హక్కుల ఉల్లంఘన (Backsliding of democracy, violation of human rights)ల కొనసాగింపు వంటి ఆరోపణలను రాజకీయ ప్రత్యర్థుల నుండి ఎదుర్కొన్నాడు.

2030 నాటికి పాకిస్తాన్‌ను ఎక్కువగా పునరుత్పాదకంగా మార్చాలనే లక్ష్యంతో ఖాన్, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచడానికి ముందుకు వచ్చాడు. పన్ను వసూలు, పెట్టుబడులను పెంచే విధానాన్ని కూడా ఆయన రూపొందించాడు. విదేశాంగ విధానంలో, అతను భారత్‌తో (india)సరిహద్దు తగాదాలను పర్యవేక్షించాడు. అమెరికా (america), చైనాలతో (china)సంబంధాలను బలోపేతం చేశాడు. విదేశాలలో పాకిస్తాన్ ప్రతిష్ఠను మెరుగుపరిచాడు. చివరగా ఇటీవల పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేయాలని ఇమ్రాన్ చేసి అభ్యర్థనను ఇస్లామాబాద్ హైకోర్ట్ తోసిపుచ్చింది.

Exit mobile version