end

నింగిలోకి పీఎస్‌ఎల్వీ-సీ49

పీఎస్‌ఎల్వీ-సీ49 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ నుంచి ఈ ప్రయోగం విజయవంతమైంది. వర్షం కారణంగా 10 నిమిషాలు ఆలస్యమైనప్పటికీ.. ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రాకెట్‌ ద్వారా 1 స్వదేశీ, 9 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఈఓఎస్‌-01 ద్వారా వాతావరణ విపత్తులు, భూమి, అడవులను పరిశీలన చేయనున్నారు. రాకెట్‌ 290 టన్నుల బరువును మోసుకెళ్లిందని షార్‌ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ప్రపంచంలో అమెరికాలోని నాసా తర్వాత అత్యధిక ఉపగ్రహాలను రోదసీలోకి పంపిన ఘనత మన ఇస్రోకే దక్కుతుందనడంలో సందేహం లేదు.

Exit mobile version