- అర్ధసెంచరీలతో రాణించిన మన్‌దీప్, గేల్
ఈ ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అద్భుతాలు చేస్తోంది. టోర్నీలో అద్భుతంగా రాణిస్తూ వరుసగా ఐదో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ మరో 7 బంతులు మిగిలుండగానే 8 వికెట్లతో విక్టరీ కొట్టింది. ఓపెనర్లు కె ఎల్ రాహుల్(25 బంతుల్లో 28 పరుగులు; 4 ఫోర్లు), మన్‌దీప్ సింగ్(56 బంతుల్లో 66 పరుగులు; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పారు.
ఈ జోడీని చక్రవర్తి విడదీశాడు. రాహుల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(29 బంతుల్లో 51 పరుగులు; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మన్‌దీప్‌తో జతకట్టి అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 25 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. విజయానికి మరో 3 పరుగులు అవసరమైన సమయంలో గేల్‌ను ఫెర్గూసన్ ఔట్ చేశాడు.
పూరన్(2 పరుగులు)తో కలిసి మన్‌దీప్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ విజయంతో పంజాబ్ ప్లే ఆఫ్ రేసులో కొనసాగనుంది. మొదట క్రీజులోకి కుదురుకోవడానికి సమయం తీసుకున్న మన్‌దీప్.. తర్వాత చూడచక్కనైన షాట్లతో చెలరేగిపోయాడు. మైదానం నలువైపులా బౌండరీలు బాది జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో చక్రవర్తి, ఫెర్గూసన్ తలా ఓ వికెట్ తీశారు.అంతకు ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్(45 బంతుల్లో 57 పరుగులు; 3ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మోర్గాన్(25 బంతుల్లో 40 పరుగులు; 5 ఫోర్లు, 2సిక్సర్లు) మాత్రమే రాణించారు. చివర్లో ఫెర్గూసన్ 13 బంతులు ఎదుర్కొని 24 పరుగులు చేసి, జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించేందుకు దోహదపడ్డాడు. మిగితా బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో షమీ 3 వికెట్లతో రాణించగా.. జోర్డాన్, రవి బిష్ణోయ్ 2, మురుగన్ అశ్విన్, మ్యాక్స్‌వెల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అత్తారింట్లో సందడి చేసిన బాహుబలి స్టార్..
ప్రతి బౌలర్ కేకేఆర్ బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెంచి, పరుగులు రాకుండా నియంత్రించారు. అర్దసెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన క్రిస్ గేల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక్కడ విశేషమేమంటే గేల్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి పంజాబ్ విజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది.