end
=
Saturday, October 5, 2024
సినీమాస్వాతంత్ర్య దినోత్సవ కానుకగా 'పుష్ప'
- Advertisment -

స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ‘పుష్ప’

- Advertisment -
- Advertisment -

స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, జీనియస్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న మరో మూవీ ‘పుష్ప’. వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడో సినిమా ఇది. ఇంతకు ముందు ఆర్య, ఆర్య2తో సూపర్‌ డూపర్‌ హిట్స్‌ అందించారు ఈ సక్సెస్‌ఫుల్‌ జోడీ. కాగా, త్వరలో తన అభిమానులను థియేటర్లలో కలవబోతున్నానంటున్నాడు మన స్టైలిష్‌ స్టార్‌. ‘పుష్ప’ సినిమా రిలీజ్ డేట్‌ను అర్జున్‌ స్వయంగా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. ఈ మూవీలో రష్మికా మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో హీరో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు అర్జున్‌ను ఇంత రఫ్‌ లుక్‌లో చూడలేమంటున్నారు అభిమానులు.

ఈ ఏడాది ఆగస్టు 13న స్వాతంత్ర్య దినోత్సవానికి ముందుగానే ‘పుష్ప’ సినిమా రిలీజ్‌ కాబోతోంది. ఈ ఏడాది మిమ్మల్నందరినీ థియేటర్లలో కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సుకుమార్, దేవిశ్రీప్రసాద్‌తో కలిసి మరోసారి మేజిక్ చేస్తానని ఆశిస్తున్నా` అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. కాగా, బన్నీ, సుకుమార్‌ కలయికలో ఇదివరకు వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలకు దేవీనే సంగీతం సమకూర్చాడు. రెండు ఆల్బమ్స్‌ కూడా సంగీత ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోసారి అదే సీన్‌ రపీట్‌ అవుతుందంటున్నాడు స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -