తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ కన్నుమూశారు. గత ఏడాది క్రితం కొవిడ్ బారిన పడిన ఆయన కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కుటుంబ సభ్యులు ఇటీవలే గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. గతేడాది డిసెంబరులో పుష్పరాజ్ ఇంటికి వెళ్లి చంద్రబాబు పరామర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న పుష్పరాజ్ 1983, 1985, 1999లో తాడికొండ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఏపీ ఆహార కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. పుష్పరాజ్ మృతి పట్ల టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.