end
=
Friday, November 22, 2024
వార్తలురాష్ట్రీయండ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక మలుపు
- Advertisment -

డ్రగ్స్‌ పార్టీ కేసులో కీలక మలుపు

- Advertisment -
- Advertisment -
  • రాడిసన్‌ హోటల్‌ లైసెన్స్‌లు రద్దు

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్‌ కలకలం రేపోతోంది. తాజాగా బడా నాయకుల కుమారులు, సెలబ్రెటీలు, ఐఎఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పిల్లలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇందులో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, నాగేంద్రబాబు కూతురు నిహారిక, రాజకీయ నేతలు నందీశ్వర్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌గౌడ్‌ కుమారులు, మాజీ డీజీపీ కూతురు పలువురిపై నిన్న కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే డ్రగ్‌ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు దొరికిపోయిన రాడిసన్‌ హోటల్‌ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. డ్రగ్స్‌ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం, అండదండలు ఉన్నాయనే విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీర్‌ ప్రభుత్వం రాడిసన్‌ పబ్‌, బార్‌ అండ్‌ రెస్టారెంట్‌, హోటల్‌కు సంబంధించి లైసెస్సులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి తెలంగాణ ఎక్సైజ్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు.

రాడిసన్‌ హోటల్‌ పరిధిలోని ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌కు 24 గంటలపాటు లిక్కర్‌ సరఫారకు జనవరి 7వ తేదీన ప్రభుత్వ అనుమతి పొందింది. ఇందుకోసం ప్రభుత్వానికి రూ.56 లక్షల బార్‌ ట్యాక్స్‌ చెల్లించింది. 2బీ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పేరుతో అనుమతి పొందినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ కేసులో బంజారాహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మరం చేశారు. అభిషేక్ ఉప్పల, అనిల్ కుమార్, అర్జున్ వీర‌మాచినేని, కిర‌ణ్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -