ఆస్ట్రేలియాతో జరగనున్న 4 టెస్టుల సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి మొదటి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై ఇండియాకు తిరిగిరానున్నాడు. విరాట్ స్థానంలో వైస్ కెప్టెన్ రహానే జట్టుకు కెప్టెన్సీ వహించనున్నాడు. రహానే కెప్టెన్సీపై టీమిండియా వెటరన్ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించారు. రహానే తన సొంత శైలిలోనే ఆడాలని సూచించాడు. కోహ్లి భిన్నమైన ఆటగాడు. అతను ఫీల్డ్‌లో చాలా చురుకుగా ఉంటాడు. దూకుడుగా ఉంటాడు. ఒక్కసారిగా తన భావోద్వేగాలను ప్రదర్శిస్తాడు. అలాగని రహానే కోహ్లిలా ఉండాలనుకోకూడదని భజ్జీ తెలిపాడు. రహానే చాలా ప్రశాంతంగా ఉంటాడని, తన శైలిలోనే ఆడి జట్టుకు విజయాలు అందించాలని సూచించాడు.