end
=
Friday, September 20, 2024
ఉద్యోగ సమాచారంరైల్వేలో 5636 ఉద్యోగాలు
- Advertisment -

రైల్వేలో 5636 ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే (Northeast Frontier Railway).. అప్రెంటీస్ (Apprentice Vacancies) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 5636 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులు మెషినిస్ట్, వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేటర్ (AC – మెకానిక్), ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర విభాగాల్లో ఉన్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్‌ 30 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

వయోపరిమితి: ఏప్రిల్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ట్రైనింగ్‌ కాలం: ఏడాది
అర్హతలు:
మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతిలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ సర్టిఫికేట్‌ కూడా ఉండాలి. (లేదా)
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ లేదా స్టేట్‌ కౌన్సిల్‌ ఫర్ వొకేషనల్‌ ట్రైనింగ్‌ జారీ చేసే ప్రొవిజనల్‌ సర్టిఫికేట్‌ ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 30, 2022 రాత్రి 10 గంటల వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://nfr.indianrailways.gov.in/

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -