end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంరెయిన్ అలెర్ట్..
- Advertisment -

రెయిన్ అలెర్ట్..

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ రెయిన్ అలర్ట్ మరోసారి భారీ వర్సాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 24 గంటల పాటు వానలు దంచికొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాగులు-వంకలు పొంగిపొర్లుతున్నాయి.

నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇవాళ చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరి నది కి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 5,91,269 క్యూసెక్కులుగా ఉంది. ఎప్పటికప్పుడు వరద ఉధృతిని సమీక్షిస్తూ వరద ముంపు ప్రభావిత జిల్లాల అధికారులను విపత్తుల సంస్థ అప్రమత్తం చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో వరద విపత్తును ఎదుర్కోటానికి ముందస్తుగా అత్యవసర సహాయక చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. రెండు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిధ్ధం చేశారు. గోదావరి పరీవాహాక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు

ఒడిశా తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. రాయలసీమ, దక్షిణ, ఉత్తర కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అటు వరుసగా నాలుగో రోజూ వర్షం దంచికొడుతూనే ఉంది. దీంతో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజల్ని అధికార యంత్రాంగం అలర్ట్ చేసింది. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. భారీ వర్షాలకు గోదావరి అనేక చోట్ల ఉగ్రరూపం దాల్చింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -