end

రెండు రోజుల్లో తెలంగాణకు వర్షసూచన

Rains in Telangana : తెలంగాణలో మండుతున్న ఎండలు(Smmer Heat), ఉక్కపోత (Humidity) నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణశాఖ(Hyderabad Metorology) తీపి కబురు చెప్పింది. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఏప్రిల్‌(April) 1 నుండి 3వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా వర్షాల కారణంగా 2,3 తేదీల్లో ఉష్ణోగ్రతలు(Temporature) చాలా తక్కువగా నమోదు అవుతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఆసీఫాబాద్‌(Asifabad), నిర్మల్‌(Nirmal), ఆదిలాబాద్‌(Adilabad), మెదక్‌(Medak), కామారెడ్డి, నిజామాబాద్‌(Nizamabad), వనపర్తి, గద్వాల్‌(Gadwal), వికారాబాద్‌(Vikrabad), మహబూబ్‌నగర్‌(Mahabubnagar) జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే పలు చోట్ల ఉరుములు(Thunders), మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని, వడగండ్ల వానలు కూడా రావచ్చని తెలిపారు.

Exit mobile version