end

Rains: ఏపీలో రేండు రోజులపాటు వర్షాలు

AP Rains : ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌(Andhrapradesh) లో పలు జిల్లాల్లో వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి(Amaravathi) వాతావరణ(Meterological) కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఛత్తీస్‌గఢ్‌(Chhattisgarh)నుండి దక్షిణ తమిళనాడు(Tamilnadu) వరకు ద్రోణి(Surface) ప్రభావం ఉంటుంది. దీంతో సోమవారం, మంగళవారం పలు ప్రాంతాలలో జల్లులు పడే అవకాశం ఉంది. గాలలు(Winds) గంటకు ౩౦ కి.మీ నుండి 40 కి.మీల వేగంతో వీస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడవచ్చని అన్నారు. విజయనగరం, తూర్పుగోదావరి(East Godavari), కృష్ణా, అనకాపల్లి, శ్రీకాకుళం, ప్రకాశం, పల్నాడు, గుంటూరు(Guntur), కాకినాడ జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికీ కోనసీమ, మండపేట, కిర్లంపూడి మండలాల్లో ఈదూరు గాలులకు వరి నెలకొరిగింది.

Exit mobile version