తెలంగాణవ్యాప్తంగా ఎండలు(Sun glare) దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలు కాకముందు నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ.. సాయంత్రం అయ్యే సరికి ఒక్కసారిగా వాతావరణం(Atmosphere)లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈదురుగాలులు(Air gallows) వీస్తున్నాయి. కొన్నిచోట్ల వడగండ్లు(Snow flakes) రాలిపడుతున్నాయి. గాలిదుమ్మూ వీస్తున్నది. ఈ క్రమంలోనే రానున్న రెండు రోజులు ఎండలు మరింత మండనున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారం ఎండలు దంచి కొట్టనున్నాయని, పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. సాధారణం కంటే రెండు లేదా మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. సోమవారం వడగాడ్పులు వీస్తాయని ప్రకటించింది. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
ఈ జిల్లాలకు వర్ష సూచన
క్యుమిలోనింబస్ కారణంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొన్నది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు గంటకు 30- 40 కి.మీతో వేగంతో వీస్తాయని ప్రకటించింది.