end

నాలుగైదు రోజుల్లో తెలంగాణలో వర్షాలు

  • ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు
  • హైదరాబాద్‌ వాతావరణశాఖ వెల్లడి

వచ్చే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు నుండి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీనివల్ల రాబోయే నాలుగైదు రోజుల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చునని అంచనా వేస్తున్నారు.

పిడుగుపడి రైతు మృతి

హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, నల్లగొండ, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 29.3 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 28.3 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.

డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రమోట్‌ !

అలాగే యాదాద్రి భువనగిరి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, జోగులాంబ గద్వాల,, కరీంనగర్‌, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, జనగాం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడ్డాయి.

Exit mobile version