టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఘోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. వికారాబాద్ జిల్లా దామగుండంలో ఆవును తుపాకీతో కాల్చి చంపిన కేసులో సానియా మీర్జా ఉందంటూ ఆయన ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లో సానియా మీర్జానే కాల్పులు జరిపిందని గ్రామస్తులు చెప్తున్నట్లు రాజా సింగ్ పేర్కొన్నారు. సానియా గతంలో కూడా నెమలిని చంపినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నట్లు ఈ బీజేపీ ఎమ్మెల్యే అన్నారు.
తృటిలో తప్పిన 40 మంది ప్రయాణికుల ప్రాణాలు..
గోమాతపై కాల్పులు జరిపిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని రాజా సింగ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.వికారాబాద్ అడవుల్లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనలో సానియా మీర్జా ఫామ్‌హౌస్ ఇంచార్జి ఉమర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో మేతకు వచ్చిన ఆవును కాల్చి చంపినట్లు ఉమర్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కే్ లేదు
నిందితుడికి తుపాకీ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే కేసు విచారణ జరుగుతుండగానే రాజాసింగ్.. సానియా మీర్జాపై ఆరోపణలు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ముస్లింలు అంటేనే తీవ్రంగా పరిణించే ఆయన గోమాతను తుపాకీతో కాల్చి చంపేసరికి ఎక్కడలేని కోపంతో రగిలిపోతున్నారు.