end

Rajapalayam:200 మంది పేద పిల్లలకు షాపింగ్

  • గొప్ప మనసు చాటుకున్న ఎస్. తంగపాండియన్
  • నియోజకవర్గ బాలల షాపింగ్ కోసం రూ. 3 లక్షల ఖర్చు
  • 2016 నుంచి ఇలాంటి పనులు చేస్తున్నానని వెల్లడి

తమిళనాడు (Tamil Nadu) రాజపాళయం (Rajapalayam) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే (MLA) ఎస్.తంగపాండియన్ (Thangapandian)గొప్ప మనసు చాటుకున్నాడు. 2016, 2021లో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (‘Dravida Munnetra Kazhagam’)అభ్యర్థిగా రాజపాళయం నుంచి రెండో సారి శాసన సభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన..  దీపావళి(Diwali)పండుగ సందర్భంగా  201 మందికి పైగా పిల్లలకు (children)కొత్త బట్టలు విప్పించి వారి కళ్లలో కాంతులు నింపాడు. విషయానికొస్తే.. ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ప్రజలను ఆకర్షించే ఎస్.తంగపాండియన్ (Thangapandian)ఆదివారం తన నియోజకవర్గంతోపాటు చుట్టుపక్కల మూడు ఇళ్లకు చెందిన చిన్నారులను టెక్స్‌టైల్ షోరూమ్‌ (Textile showroom)తీసుకెళ్లి నచ్చిన దుస్తులు కొనుక్కోమని ఆఫర్ ఇచ్చాడు. ఇందుకోసం ఏకంగా తన నుంచి రూ. 3 లక్షలకు (3 lakhs)పైగా బిల్లును (bill) చెల్లించడం విశేషం. కాగా ఈ వార్త దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 

ప్రతి సంవత్సరం (every year) ఏదో ఒక ఫెస్టివల్‌కు (festival) తనదైన ముద్ర వేసేలా వినూత్నంగా ఆలోచించే పాండియన్.. ఈ యేడాది పెద్ద సంఖ్యలో పిల్లలు చిరునవ్వుకు కారణమయ్యాడు. పట్టణంలో ఉన్న వాళ్లతో సహా చుట్టుపక్కల ఉన్న మూడు ఇళ్లకు చెందిన నిరుపేద పిల్లలకు, పండుగకు ఇష్టమైన దుస్తులను ఎంపిక చేసుకోవడానికి షోరూమ్‌కు తీసుకెళ్లాడు. అయితే వీళ్లందరినీ స్వయంగా గ్రామానికి వెళ్లి వాహనాల్లో పట్టణానికి తీసుకురాగా.. ఇళ్లలో ఉన్న 230 మంది పిల్లలకు గానూ 201 మంది షాపు వద్దకు వచ్చారు. వారంతా మధ్యాహ్నానికి ముందే షాపింగ్ పూర్తి చేశారు. తమకు నచ్చిన రంగు(colour), డిజైన్‌లో (design)డ్రెస్‌ (dress)లను ఎంపిక చేసుకోగలిగినప్పుడు వారి ముఖాల్లో ఆనందం (Happy faces) వెల్లివిరిసింది. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ (viral)అవుతుండగా పాండియన్ పెద్ద మనసు చాటుకున్నాడంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

(Bharat Jodo Yatra:”భారత్ జోడో యాత్ర”లో తగ్గిన జోష్)

  ‘తమకు నచ్చిన రంగు, డిజైన్‌లో డ్రెస్‌లను ఎంపిక చేసుకోగలిగినప్పుడు వారి ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందాన్ని చూసి సంతోషించాను. వారి ప్రయత్నాలన్నింటికీ తోడ్పాటునందించేందుకు తమ వెంట మేము ఉన్నామని చెప్పడమే ఇందుకు ఉదహారణ. 2016లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇదే పని చేస్తున్నా. ఇది షాపింగ్ సీజన్ (Shopping season)కాబట్టి మేము షాప్ యజమాని సహాయంతో పిల్లలకు షాపింగ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. షాప్ షెడ్యూల్ చేసిన పని సమయానికి ఒక గంట ముందుగానే తెరిచారు. తద్వారా పిల్లలు స్వేచ్ఛగా తిరుగుతూ దుస్తులు ఎంచుకున్నారు. ఓపికగా వారి ఎంపిక చేసుకున్నాకే ఏదీ రిజెక్ట్ చేయకుండా పూర్తి బిల్లు చెల్లించా’ అని తంగపాండియన్ సంతోషంగా చెప్పుకొచ్చాడు.

Exit mobile version