హైదరాబాద్: బీజేపీ గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి సెషన్స్ కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్షను విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బీఫ్ ఫెస్టివల్ ఘటనలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం కేసు నమోదయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గానూ పోలీసులు కేసు నమోదు చేశారు. శిక్ష ఖారారు కావడంతో ఆయన వెంటనే బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. నెలరోజుల్లో హైకోర్టులో తేల్చుకోవాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.