end

చెన్నై ఢమాల్‌.. రాజస్తాన్‌ ఘనవిజయం

ఆ హీరోయిన్‌ బయోపిక్‌లో సాయిపల్లవి..!

ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా అబుదాబి వేదికగా జరిగిన RR, CSK జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ జట్టు మరో 15 బంతులు మిగిలుండగానే ఘనవిజయం సాధించింది. 126 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ జట్టును ఆదిలోనే చెన్నై జట్టు ముప్పుతిప్పలు పెట్టింది. వరుస ఓవర్లలో టాపార్డర్‌ వికెట్లు తీసి ఆర్‌ ఆర్‌ జట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచింది.

సంక్షోభంలోనూ ప్రజలను పట్టించుకోవడం లేదు

కానీ, తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్‌, బట్లర్‌ కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. తర్వాత గేర్ మార్చి జట్టును విజయ తీరాలకు చేర్చారు. కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌(26 పరుగులు; 2 ఫోర్లు), జోస్‌ బట్లర్‌(48 బంతుల్లో 70 పరుగులు; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సాధించారు. ముఖ్యంగా బట్లర్‌ ఒత్తిడిలో తానాడిన ఇన్నింగ్స్‌ ఆమోఘం. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు.

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

సీ ఎస్‌ కే బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 2 వికెట్లు, హెజెల్‌వుడ్‌ 1 వికెట్‌ తీశారు. జట్టు ఒత్తిడిలో ఉండగా తన వీరోచిత బ్యాటింగ్‌తో తన జట్టుకు విజయాన్ని అందించిన జోస్‌ బట్లర్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ విజయంతో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది. చెన్నై చివరి స్థానంలో ఉంది.

వినియోగదారులకు పేటిఎం షాక్‌

Exit mobile version