end

అభివృద్దికి నోచుకోని రామప్ప దేవాలయం

  • – 2021లో యునెస్కో గుర్తింపు

యూనెస్కో గుర్తింపు వచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు రామప్ప. అధికారులు అభివృద్ధి కోసం ఆలోచించి మరమత్తులు చేస్తే పర్యాటకులు పెరిగే అవకాశం లేకపోలేదు. ఆనాటి కాకతీయుల కళావైభవం చూడాలంటే తెలంగాణలోని వరంగల్ చుట్టు పక్కల ప్రాంతంలో ఎన్నో కట్టడాలను చూడొచ్చు… అందులో ఒకటి రామప్ప దేవాలయం.ఆనాటి శిల్ప కళా వైభవాలకు నిలువెత్తు రూపం. ప్రపంచపర్యాటకులను సైతం ఆకర్షించిన రామప్ప కట్టడం..మన అధిఆకారుల మనస్సును మాత్రం మార్చలేకపోతుంది.కాకతీయుల కళావైభవాన్ని చాటినఆలయాన్ని 2021 జూలైలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం (World heritage site)గా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు… యూనెస్కో పరిశీలనకు ఎంపికవ్వగా.. భారత్‌ నుంచి రామప్పకు ప్రపంచస్థాయి ఖ్యాతి లభించింది.

రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకుని దాదాపు సంవత్సరం పూర్తి అవుతుంది. వెంటనే మన రాజకీయ నాయకులు అధికారులు, ఆకాశం అంత పందిరి వేసి అభివృద్ధి చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదు. అభివృద్ధి ఫోటోలకు మాత్రమే పరిమితం అయ్యింది. కాకతీయ రాజు ఐనా గణపతి దేవ పాలనలో రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించినట్టు చరిత్రలో రాయబడింది.ఆలయం నిర్మాణం దాదాపు 40 సంవత్సరాల పాటు సాగింది. 40 సంవత్సరాలు పాటురామప్ప అనే శిల్పి ఈ ఆలయ నిర్మాణం కోసం తీవ్రంగా కష్టపడ్డాడు. దానికి బదులు గానే ఈ దేవాలయానికి రామప్ప అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ విధంగా ఒక శిల్పి పేరు మీద దేవాలయం మరెక్కడా లేదు. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. కాకతీయ శిల్పకళా చాతుర్యం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది.

దేవాలయం మండపానికి బయటి భాగంలోనాలుగు పక్కలా అమర్చిన పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు కాకతీయుల శిల్పకళా వైభవాన్ని చాటుతున్నాయి.రామప్ప దేవాలయం ఆలయప్రాంగణంలో ఉన్న కామేశ్వర ఆలయం కూడా పునర్ నిర్మాణం చేయాల్సి ఉంది. ఆలయ పునర్నిర్మాణం పక్కనపెడితే ఆలయ ప్రధాన ప్రహరీ చాలా వరకు శిధిలం అయింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకుని రామప్ప దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి కాకతీయుల కళా సంపదను రాబోయే భావితరాలకు చూపించే విధంగా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Exit mobile version