end
=
Thursday, July 4, 2024
సినీమాఅదిరిపోయిన రామరాజు ఫ్రమ్‌ భీమ్‌..
- Advertisment -

అదిరిపోయిన రామరాజు ఫ్రమ్‌ భీమ్‌..

- Advertisment -
- Advertisment -

ప్రముఖ దర్శకులు రాజమౌళి రూపొందిస్తున్న మరొక అపురూప చిత్రం రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌). స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమ్రం భీమ్‌ల జీవిత ఘట్టాల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. కోవిద్‌19 కారణంగా సినిమా షూటింగ్‌ కాస్త ఆలస్యమైనా.. దర్శకుడు రాజమౌళి సినిమాకు సబంధించిన అప్‌డేట్స్‌ ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా అందిస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు భీం ఫ్రం రామరాజు పరిచయ వీడియో ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ వీడియోలో రామరాజుగా చరణ్‌ అద్భుతంగా ఉన్నారు. సినిమా కోసం ఆయన తన బాడీని మలుచుకున్న తీరు అమోఘం. ఈ వీడియో దేశంలోని సినీవర్గాలనే కాకుండా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. రామరాజు కోసం భీం(ఎన్టీఆర్‌) చెప్పిన వాయిస్‌ ఓవర్‌ అన్ బిలీవబుల్‌. అందరికీ నచ్చేసిందంతే.

ఇవాళ రామరాజు ఫ్రం భీం వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. కొమ్రం భీంగా ఎన్టీఆర్‌ అదిరిపోయారు. అతని రాజసం మామూలుగా లేదు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్‌ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. చాలా ధృఢంగా తయారయ్యారు. భీం గురించి రామరాజు(చరణ్‌) పరచయం చేయడం చాలా బాగుంది. చరణ్‌ వాయిస్‌ అభిమానులను కట్టిపడేసింది. కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ అమేజింగ్‌. జస్ట్‌ పాత్రల పరిచయాలే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా టీజర్‌, అసలు సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -