end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంరాములమ్మ చూపు బీజేపీ వైపేనా..?
- Advertisment -

రాములమ్మ చూపు బీజేపీ వైపేనా..?

- Advertisment -
- Advertisment -

ప్రముఖ సినీనటి, కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ రాములమ్మ(విజయశాంతి) చూపు బీజేపీ వైపు మళ్లుతోందా..? ఆవిడ నిన్న చేసిన ట్విట్టర్‌ పోస్ట్‌ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో విజయశాంతి కొన్ని రోజులు కాంగ్రెస్‌ అభ్యర్థికి సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. కానీ, ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పరిస్థితి మరింత ఘోరంగా తయారయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ తాను తీసుకున్న గోతిలో తానే పడే స్థితికి చేరుకున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అనీ.. కాంగ్రెస్‌ భవితవ్యం ఇక ప్రజలే నిర్ణయించాలని ఆమె ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌తో రాజకీయ వర్గాల్లో చిన్నపాటి ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు. విజయశాంతి ట్వీట్ ఆంతర్యం ఏంటని గుసగుసలు మొదలయ్యాయి. రాములమ్మ త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతుందనీ.. బీజేపీలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక విజయశాంతి బీజేపీలో చేరితే ఆ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడుతుందనడంలో సందేహం లేదు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -