రమ్యకృష్ణ శివగమీ గా ఒక భారీ గుర్తింపు దక్కించుకుంది. బాహుబలి(Bahubali) తర్వాత రమ్యకృష్ణ రేంజ్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. వెండి తెరపై ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు కానీ కొందరు మాత్రం తమ కంటూ ఒక స్టాంప్ వేసుకొని తరాలుగాప్రేక్షకుల మనసులో నిలిచిపోతారు అలాంటి వారిలో అందాల తార మన శివగమీ రమ్యకృష్ణ (Ramya Krishna). ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో కమర్షియల్ చిత్రాల్లో నటించి ఆమె సత్తా ఏంటో చూపించి అగ్రహీరోయిన్ గా ఎదిగారు. నేడు ఈ అందాల భామ పుట్టిన రోజు. దాదాపు అందరు స్టార్ హీరోల(Star Heros) సరసన నటించి మెప్పించారు రమ్యకృష్ణ. 1985లో వచ్చిన భలే మిత్రులు చిత్రంతో హీరోయిన్(Heroine) గా తెలుగు చిత్రరంగంలోకి ఆరంగేట్రం చేశారు.
నరసింహ చిత్రంలో రజినీకాంత్(Rajinikanth)తో పోట పోటీగా నటించి ‘నీలాంబరి’ పాత్ర తో ఎప్పటికీ చరగని ముద్ర వేసుకున్నారు . ఈ సినిమా దక్షిణ భారతదేశంలో కాకుండా, సింగపూర్, లండన్, ఫ్రాన్స్, జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.. ఇటీవలే లైగర్ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో నటించారు రమ్యకృష్ణ. ప్రస్తుతం రంగమార్తాండ సినిమాలో నటిస్తున్నారు రమ్యకృష్ణ. OTT ప్లాట్‌ఫారమ్‌లో రమ్య కృష్ణన్ తొలిసారిగా న్యాయనిర్ణేతగా కనిపించనున్నారు.పాత్ర చిన్నద పెద్దాదా అనే తేడలేకుండా తనదైన నటనతో మెప్పిస్తొన్న రమ్యకృష్ణ ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకుపోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం ..