end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఅత్యాచారం కేసులు సత్వర న్యాయం
- Advertisment -

అత్యాచారం కేసులు సత్వర న్యాయం

- Advertisment -
- Advertisment -
  • మెదక్‌ జిల్లా కేంద్రంలో ప్రత్యేక పోక్సో కోర్టు ప్రారంభించిన జస్టీస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌

చిన్నారులపై లైంగిక వేధింపులు, అత్యాచారం కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు మెదక్ జిల్లా న్యాయస్థాన సముదాయం లో ఏర్పాటుచేసిన ప్రత్యేక పోక్సో కోర్టును ఆదివారం హైకోర్ట్ జడ్జి ,ఉమ్మడి మెదక్ జిల్లా పరిపాలన జడ్జి జస్టిస్ టి అమర్ నాథ్ గౌడ్ ప్రారంభించారు . జస్టిస్ అమర్ నాథ్ గౌడ్ సమక్షంలో పొక్స్ కోర్టు జడ్జి జస్టిస్ మైత్రీ బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి పాపి రెడ్డి తో కలిసి పోక్సో కోర్టు కు సంబంధించిన సెక్షన్ గెస్ట్ రూమ్ లను ఆయన ప్రారంభించారు. అనంతరం బార్ అసోసియేషన్ హాల్లో మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రారెడ్డి, జనార్దన్ రెడ్డి, ప్రతాపరెడ్డి లతోపాటు సిద్దిపేట, సంగారెడ్డి జిల్లా, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు.అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపి రెడ్డి మాట్లాడుతూ పోక్సో చట్టం పై న్యాయవాదులకు అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అలాగే దీనిపై వర్క్ షాప్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఈ చట్టం ప్రధాన ఉద్దేశం లైగింక నేరాల నుంచి బాలలను కాపాడుటకు, వారికి రక్షణ, సత్వర న్యాయం కల్పించేందుకు 2012 – బాలల రక్షణ చట్టం (పోక్సో) తెచ్చారు. 18 ఏళ్ల లోపు బాలికలతో పాటు బాలురపై లైంగిక నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించేందుకు ఈ చట్టంలో పలు సెక్షన్లు పొందుపరిచారు. ప్రధానంగా లైంగిక వేధింపులు, లైంగిక దాడులు అనే రెండు రకాల ప్రధాన నేరాలను నిర్వచించి, ఇట్టి నేరాలకు పాల్పడిన వారిపై కేసు తీవ్రతను బట్టి జైలు శిక్ష, జీవిత త ఖైదు, జరిమానా విధించుటకు ఈ చట్టంలో వీలు కల్పించారు. ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు పరచుటకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర బాలల హక్కులు పరిరక్షణ కమీషన్ పర్యవేక్షిస్గతుంది. బాధిత బాలలకు భద్రగథా కల్పించడంతో పాటు, వారికి అవసరమైన వైద్య సేవలు, పునరావాసం వంటివి కమీషన్ కల్పించుటకు చర్యలు తీసుకుంటుంది.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రిన్సిపాల్ జిల్లా సెషన్స్ జడ్జ్ పాపి రెడ్డి, పోక్సో కోర్టు జడ్జి మైత్రేయి, జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ చందాన దీప్తి,సీనియర్ సివిల్ జడ్జ్ సుహాసినిని, జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, స్పెషల్ మొబైల్ మేజిస్ట్రేట్ సాయి కిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్ర రెడ్డి, కార్యదర్శి సంతోష్ రెడ్డి, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -