టాలీవుడ్ సిల్వర్‌స్ర్కీన్‌పై సరికొత్త జోడీని చూడబోతున్నాం. వరుస హిట్లతో దూసుకుపోతున్న గీతాగోవిందం భామ రష్మిక మందాన.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించనున్నట్లు ఫిల్మ్‌నగర్ సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ కలయికలో ఓ పవరఫుల్ మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో చరణ్ ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. చరణ్ కు సరసన హీరోయిన్‌గా మొదట కియారా అద్వానీ అనుకున్నా.. ఆమెకు బిజీ షెడ్యూల్ ఉండడంతో ఫైనల్‌గా రష్మికను సంప్రదించగా ఆమె ఓకే చెప్పినట్లు సమాచారం. జనవరి మూడో వారంలో వీరిద్దరూ షూటింగ్‌లో పాల్గొంటారు.