end
=
Saturday, January 18, 2025
సినీమాతమిళ, మలయాళ భాషల్లో రవితేజ మూవీ
- Advertisment -

తమిళ, మలయాళ భాషల్లో రవితేజ మూవీ

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన చిత్రం ‘క్రాక్‌’. ఈ మూవీలో శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటించగా, తమిళ నటుడు సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌ విలన్స్‌గా నటించారు. ప్రముఖ నిర్మాత బి.మధు తన సొంత నిర్మాణ సంస్థ సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌పై ఈ చిత్రాన్ని నిర్మించగా.. గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘క్రాక్‌’ మూవీ సూపర్‌ హిట్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాకు తొలి నుంచే మంచి టాక్‌ రావడంతో థియేటర్లు మునుపటి కళను సంతరించుకున్నాయి. ప్రేక్షకులు, అభిమానులు థియేటర్లకు క్యూ కట్టారు. రవితేజ కేరీర్‌లోనే ఈ మూవీ బిగ్‌ హిట్‌గా నిలిచిందని సినీ విశ్లేషకులు కన్‌ఫాం చేశారు.

మొదట ఈ చిత్రాన్ని ‘ఆహా’ ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు చిత్ర యూనిట్‌. కానీ, థియేటర్లలో ప్రేక్షకుల సందడి ఏ మాత్రం తగ్గకపోవడంతో కొంత ఆలస్యంగానైనా థియేటర్లలో రిలీజ్‌ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని తమిళం, మలయాళం భాషల్లోకి డబ్‌ చేశారు. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు కూడా నచ్చుతుందన్న నమ్మకం ఉందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అందుకే ఫిబ్రవరి 5న ‘క్రాక్‌’ మూవీ తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -