మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్యుడికి మరోసారి షాక్ ఇచ్చింది. వడ్డీ రేట్లను భారీగా పెంచారు. రెపో రేట్ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెరిగింది. దీంతో వడ్డీ రేటు 5.40 శాతానికి పెరిగింది. గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షలో 50 బీపీఎస్ పాయింట్లు మేర రెపోరేటును నిర్ణయాన్ని ఏకగగ్రీవంగా తీసుకున్నారు. ఈసారి రెపో రేట్ 35 బేసిస్ పాయింట్స్ పెరిగే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తే ఆర్‌బీఐ ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేటు పెంచింది. 100 బేసిస్ పాయింట్స్ ఒక శాతం లేదా ఒక రూపాయితో సమానం. అంటే ఇప్పుడు 50 పైసలు వడ్డీ రేటు పెరిగింది. ఫలితంగా గృహ, వాహనాల రుణాలపై వినియోగదారులకు ఈఎంఐ భారం కాస్త ఎక్కువగా పడనుంది. హోమ్ లోన్, పర్సనల్ లోన్, ఇతర రుణాల వడ్డీ రేట్లు పెరుగుతాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారికీ ఇప్పుడు ఉన్న వడ్డీ రేటు వర్తిస్తుంది. ముఖ్యంగా రెపో రేట్‌కు అనుసంధానమైన హోమ్ లోన్లు తీసుకున్న వారికి తాజా సవరణతో సమస్య ఉంటుంది. దాదాపు 40 శాతం రుణాల రేట్లు ఇలానే ఉంటాయి. అలాగే ఆ ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుంది.
రెపో రేట్లు అంటే వడ్డీ రేట్లు పెంచాలా? తగ్గించాలా? స్థిరంగా ఉంచాలా? అనే నిర్ణయాన్ని రెండు నెలలకు ఓసారి ద్రవ్య విధాన కమిటీ సమీక్షా సమావేశంలో ఆర్‌బీఐ తీసుకుంటుంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా, దేశంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆర్‌బీఐ దశలవారీగా 250 బేసిస్ పాయింట్స్ అంటే 2.50 శాతం వడ్డీ రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు వడ్డీ రేట్లు పెంచుతూ ఉంటుంది ఆర్‌బీఐ.