end
=
Friday, November 22, 2024
బిజినెస్‌RBI Key Rates : కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేవు
- Advertisment -

RBI Key Rates : కీలక వడ్డీ రేట్లలో మార్పులు లేవు

- Advertisment -
- Advertisment -

RBI Key Rates : వడ్డీ రేట్లను(Key Rates) యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బిఐ(RBI) గురువారం ప్రకటించింది. మంగళవారం నాడు జరిగిన MPC సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (RBI Governer) ప్రకటించారు. కీలక వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగుతాయన్న విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) వడ్డీ రేట్లను ప్రకటించింది. 6.5 శాతం వద్ద రేపోరేటు (Repo Rate) కొనసాగిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ వెల్లడించారు.

బ్యాంక్‌ రేట్‌ 6.75 శాతం (6.75%) వద్ద స్థిరంగా ఉన్నాయి. రిటైల్‌ (Retail) రంగంలో ద్రవ్యోల్బణం(inflation) తగ్గడంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధికి అనుకూలంగా కీలక రేట్లలో ఆర్‌బిఐ మార్పులు చేయకపోవచ్చుననే విశ్లేషకులు అంచనాలు వేశారు. అయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు మే, 2022 నుండి ఆరు దఫాల్లో రేపోరేటను 250 బేసీస్ పాయింట్ల మేర ఆర్‌బిఐ పెంచింది. రిటైల్‌ ద్రవ్యోల్బణ(Retail Inflation) లెక్కలను పరిగణలోకి ఆర్‌బిఐ తీసుకుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -