end

Paytm Payments Bank ఆర్‌బిఐ ఆంక్షలు

పేటీఎంపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) అంక్షలు విధించింది. పేటీఎంకు చెందిన పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకులో కొత్త ఖాతాదారులను చేర్చుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆర్‌బిఐ ఆదేశాలు జారీ చేసింది. పర్యవేక్షణ లోపాలు, ఐటీ వ్యవస్థ పనితీరుపై ఆర్‌బిఐ ఈ నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు ఐటీ వ్యవస్థ నిర్వహించేందుకు తక్షణమే ఆడిట్‌ సంస్థను నియమించుకోవాలని తెలిపింది.

మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష

బ్యాంకింగ్‌ యాక్ట్‌ 1949లోని సెక్షన్‌ 35ఏ ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. ఐటీ ఆడిట్‌ అధికారులను నియమించుకొని వారు ఇచ్చిన ఆడిట్‌ నివేదక ఆధారంగా తదుపరి అనుమతులు ఇస్తామని ఆర్‌బిఐ పేర్కొంది. సాంకేతిక లోపాలు, ఆడిట్‌ వ్యవస్థ పటిష్టం అయ్యాకే ఆంక్షలు ఎత్తవేయనున్నట్లు తెలిపింది.

Exit mobile version