end

‘రియల్‌మీ’ క్లాసిక్‌ ఇయర్‌ బడ్స్‌ విడుదల

  • ఆగస్టు 24 నుండి భారత్‌లో అమ్మకాలు ప్రారంభం

స్మార్ట్‌ ఫోన్‌ మొబైల్‌ కంపెనీ రియల్‌మీ ‘క్లాసిక్‌ ఇయర్‌బడ్స్‌’ పేరుతో తక్కువ ధర గల ఇయర్‌ఫోన్స్‌ను విడుదల చేసింది. దీంతో రియల్‌మీ సంస్థ మొబైల్‌ ఫోన్లతో పాటు ఆడియో డివైజ్‌ల కంపెనీగా కూడా పేరొందుతుంది. వీటి ధర కేవలం రూ.399 మాత్రమే. అయితే ఈ క్లాసిక్‌ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో ఈ నెల 24 నుండి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. పాటలు వినడంతోపాటు కాల్స్‌ను కూడా రిసీవ్‌ చేసుకోవచ్చు. సౌండ్‌ కంట్రోలర్‌ కూడా ఉంది. తెలుపు, నలుపు రంగులలో లభ్యమవుతాయి. రియల్‌మీ తన అమ్మకాలను అమెజాన్‌ ఇండియా ద్వారా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది. దీంతోపాటు క్లాసిక్‌ ఇయర్‌బడ్స్‌ ప్రింటెడ్‌ టీ-షర్టును కూడా సెప్టెంబర్‌ 4 నుండి రియల్‌మీ సొంత వెబ్‌సైట్‌ ద్వారా అమ్మకాలు జరపనుంది.

సాంకేతికపర వివరాలు

ప్రోడక్టు పేరు – రియల్‌మీ క్లాసిక్‌ ఇయర్‌ బడ్స్‌
లెవల్‌ – ఎంట్రీ లెవల్‌
ఆడియో – 14.2 mm డ్రైవర్స్‌
క్వాలిటీ – హై డెఫినేషన్‌ (HD)
రంగులు – తెలుపు, నలుపు

(ఇండియాలో విడుదలకానున్న Realme C15 మొబైల్‌)

Exit mobile version