- ప్రభుత్వ మహిళా ఉద్యోనిపై అత్యాచారం
- రూ.10 లక్షలు, 35 తులాల బంగారం కాజేసిన మోసగాడు
గవర్నర్ కాన్వాయ్‌పై ఆత్మాహుతిదాడి
భర్త ఉద్యోగం హైదరాబాద్‌లో… భార్య ఉద్యోగం ఆదిలాబాద్‌లో… అయితే మహిళా ప్రభుత్వ ఉద్యోగిని హైదరాబాద్‌లో తన భర్త పిల్లలతో కలిసి ఉండాలని ఆశపడింది. దీంతో ఎలాగైనా సరే తను హైదరాబాద్ ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇంతలోనే సమీప బంధువుల ద్వారా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడిపల్లికి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గాలిపెల్లి చంద్రశేఖర్ పరిచయం అయ్యాడు. అతను ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని, తనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తెలుసునని నమ్మబలికాడు.
ఎస్‌బిఐ ఏటీఎం ధ్వంసం… రూ.11.55 లక్షలు చోరీ
అంతేగాకుండా సదరు మహిళ వద్ద నుండి లక్షల్లో డబ్బులు కాజేశాడు. అనంతరం ఆమెను హైదరాబాద్ తన నివాసానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇదేగాకుండా తన వద్ద ప్రైవేటు వీడియోలు, ఫోటోలు ఉన్నాయని బెదిరించి రూ.10 లక్షలు, 35 తులాల బంగారం తీసుకొని మోసం చేశాడు. ఇవి చాలవన్నట్టు బాధితురాలి వద్ద నుండి ఇంకా పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయడంతో విసుగు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు చంద్రశేఖర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తెలంగాణలో పెరుగుతున్న కోవిడ్ కేసులు