end

రికార్డు స్థాయిలో వర్షపాతం

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ కేంద్రం తెలిపింది. ఆగష్టు 3, 4 తేదీల్లో కూడా పలు జిలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూన్, జులై నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు వర్షపాతం నమోదైంది. గత 30రోజుల్లో రికార్డు బ్రేక్ చేసే వర్షపాతం నమోదైంది. వరుణుడు కురవాల్సిన వాన కంటే అధికంగా కురుస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.

జులై నెలలో ఇంతటి వర్షపాతాన్ని గతంలో ఎప్పుడు చూడలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తిగా 66.4 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 107శాతం అధికమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 100శాతం అధికంగా వర్షం దంచికొట్టింది. ఒక్క వారం రోజుల్లోనే సరికొత్త రికార్డు నమోదైంది. జులై 21 నుంచి 27వరకు హైదరాబాద్‌లో 137శాతం అదనపు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అధికంగా మేడ్చల్‌ జిల్లాలో 253శాతం, రంగారెడ్డి జిల్లాలో 191శాతం అదనపు వర్షం కురవడంతో కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. ఓవరాల్‌గా GHMC పరిధిలో ఇప్పటివరకు 49.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 70.9శాతం అదనం అని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Exit mobile version