* కాంగ్రెస్ పార్టీకి అజ్ఞాత నేతల దడ
* నేతల మధ్య కొరవడిన సఖ్యత
* వెనుకంజ వేస్తున్న ఆశావహులు
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections)ఆయా నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులకు అజ్ఞాతంలో ఉన్న పలువురు నేతలు, వ్యాపారవేత్త (businessman)ల భయం పట్టుకుంది. కాంగ్రెస్ (Congress)పార్టీని బలోపేతం చేసి, ఖర్చులకు వెనుకంజ వేయకుండా కృషి చేసినా అధిష్టానం నుంచి టికెట్ (Ticket)లభిస్తుందన్న హామీలు లేకపోవడంతో అభద్రత భావం మొదలైంది. మహబూబ్ నగర్ (mahaboobnagar)ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul gandhi)సారథ్యంలో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)ను విజయవంతం చేసేందుకు నాయకులందరూ కలిసి సమష్టిగా శ్రమించి పార్టీని బలోపేతంగా రూపొందిస్తారని ఆశించారు. కాని రెండోరోజూ యాత్ర తేలిపోవడంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుకోవడం కష్టంగానే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
2014 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేలు (MLA)గా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఐక్యత లేక పార్టీ పరిస్థితి మరింత ప్రమాదంలో పడింది. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కొల్లాపూర్ (kollapur)అసెంబ్లీ స్థానం ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan reddy)ఒక్కరే గెలుపొందారు. ఆయన టీఆర్ఎస్ (TRS) పార్టీలో చేరడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఉనికి లేకుండా పోయింది. అప్పుడు మొదలుకొని ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో పార్టీ పుంజుకోలేక సతమతమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర ఉంటుంది అని తెలియగానే శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం (former glory) తెచ్చేలా ఈ యాత్ర ఉపయోగపడుతుందని ఆశించారు. కానీ ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చెయ్యాలని ఆశిస్తున్న నేతల సఖ్యత లేకపోవడం, మరికొన్ని నియోజకవర్గాల్లో చెప్పుకోదగిన స్థాయి నాయకులు లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్‌గా మారింది. చాలా సంవత్సరాల తర్వాత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ఆయా నియోజకవర్గాల నేతలు సరైన రీతిలో స్పందించకపోవడంతో రాహుల్ గాంధీ సారథ్యంలోని భారత్ జోడో యాత్రకు మొదటి రోజు లభించిన ఆదరణ రెండో రోజు లేకుండా పోయింది. క్రమక్రమంగా ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ పాలమూరు (palamuru)జిల్లాలో బతికి బట్ట కట్టడం కష్ట సాధ్యమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తప్పనిసరిగా టికెట్లు వస్తాయి అన్న నమ్మకం ఆ పార్టీ నేతల్లో కలగడం లేదు. కష్టపడి ప్రజలలో ఆదరణ పెంచుకున్న తర్వాత ఎన్నికల సమయంలో అడుగుపెట్టి అమాంతం టికెట్లు ఎగరేసుకుపోతే తమ పరిస్థితి ఏంటి అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. దీనితో రాహుల్ యాత్రకు ఆశించిన స్థాయిలో ఖర్చులు (Expenses)పెట్టకుండా నామమాత్రంగా కార్యక్రమాలు అయ్యాయి అనిపించుకునే విధంగా వ్యవహరిస్తున్నారు.
పాలమూరు జిల్లాలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గా (constituency)ల్లో రెండు మూడు నియోజకవర్గాల మినహాయిస్తే అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారు. అందరూ గత కొన్ని సంవత్సరాల నుంచి పార్టీ కార్యక్రమాలను (Party activities)నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆశావహుల్లో దడ పుడుతుంది. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయాలని కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు భావిస్తున్న నేపథ్యంలో తమకు ఎక్కడ అవకాశం లేకుండా పోతుందో అన్న భయంతో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్న విమర్శలు (Criticisms)ఉన్నాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్ (kodangal), అచ్చంపేట(achampet), కల్వ కుర్థి (kalwakurthy), అలంపూర్ (alampoor) నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోటా పోటీ వాతావరణం నెలకొని ఉంది. గద్వాల(gadwala), మహబూబ్ నగర్ (mahaboobnagar)లలో పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అంటే .. ఒకటి రెండు పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి. మిగిలిన దేవరకద్ర (devarakadra), జడ్చర్ల (jadcherla), కొల్లాపూర్ (kollapur), వనపర్తి (vanaparthy) నియోజకవర్గాలలో నాయకుల మధ్య పోటీ ఉంది . ఇది ఇలా ఉంటే త్వరలోనే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, సైతం పార్టీలోకి వస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇన్నాళ్లు టికెట్ పై ఆశలు పెట్టుకున్న నాయకులు మాకెందుకులే అన్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే రాహుల్ గాంధీ సారథ్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర బాధ్యతలు మోయడానికి నాయకులు ఎవరు ముందుకు రావడం లేదని ప్రజలు అంటున్నారు.
(Parag Agarwal : ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఔట్)
ఇదిలావుంటే.. ఏపీలో (AP) చేపట్టిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా నినాదాన్ని (Special status slogan) పత్యేకంగా వినిపించింది. రాష్ట్ర విభజన తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒడిదుడుకులను చవిచూసిన ఆ పార్టీ రాష్ట్రంలో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేసింది. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు సాధించలేకపోయింది. చాలా మంది నాయకులు పార్టీని వీడి వైఎస్సార్‌సీపీ(YSRCP), టీడీపీ(TDP)లో చేరారు. కేవీపీ రామచంద్రరావు, పళ్లం రాజు, జేడీ శీలం వంటి కొద్దిమంది నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో మిగిలారు. APCC మాజీ చీఫ్ N రఘువీరా రెడ్డి కూడా మూడు సంవత్సరాలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం యాత్రలో రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో కలిసి ఉన్నారు. ప్రత్యేక హోదా అనేది APకి బలమైన సెంటిమెంట్ గా ఉంది. TDP, YSRCP రాష్ట్రానికి ఈ హోదాను తీసుకురావండో విఫలమయ్యారని నిందించుకుంటున్నాయి. సాంకేతిక కారణాల వల్ల హోదా సాధ్యం కాదని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) స్పష్టం చేసింది. వివిధ రంగాల్లో రాష్ట్రం వేగవంతమైన వృద్ధికి ప్రత్యేక హోదా దోహదపడుతుందని ఏపీ నేతలు భావిస్తున్నారు.